Elon Musk: మరోసారి కఠిన నిర్ణయం తీసుకున్న మస్క్.. 4,400 మంది కాంట్రాక్ట్ వర్కర్లు ఔట్..!

ప్రస్తుతం తొలగించిన 4,400 మందికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగించినట్లు సమాచారం. కంపెనీ ఈ-మెయిల్‌, ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్‌ కోల్పోయిన తర్వాతే తాము లేఆఫ్‌లకు గురైనట్లు వారికి తెలిసిందట.

Elon Musk: మరోసారి కఠిన నిర్ణయం తీసుకున్న మస్క్.. 4,400 మంది కాంట్రాక్ట్ వర్కర్లు ఔట్..!

Musk

Elon Musk: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్ దయాదాక్షిణ్యాలు లేకుండా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాడు. ట్విటర్‌ను తన హస్తగతం చేసుకున్న తరువాత.. సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన మస్క్.. ఖర్చులు తగ్గించుకునేందుకంటూ 50శాతం మంది ఉద్యోగులపై వేటు వేశారు. తాజాగా ఔట్‌సోర్సింగ్ విభాగంలోనూ ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. మొత్తం 5,500 మందికి‌పైగా ట్విటర్‌కు కాంట్రాక్ట్ ఉద్యోగులుండగా మస్క్ వీరిలో దాదాపు 4,400 మందిని తొలగించినట్లు మీడియా నివేదికలు వస్తున్నాయి.

Elon Musk: ఎలాన్ మస్క్ క్షమాపణలు చెప్పాడు..! ఎందుకంటే..

ప్రస్తుతం తొలగించిన 4,400 మందికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగించినట్లు సమాచారం. కంపెనీ ఈ-మెయిల్‌, ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్‌ కోల్పోయిన తర్వాతే తాము లేఆఫ్‌లకు గురైనట్లు వారికి తెలిసిందట. తాజా కోతలపై ట్విట్టర్‌ నుంచి గానీ, కొత్త బాస్‌ మస్క్‌ నుంచి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Elon Musk: ట్విట్టర్ దివాలాపై ఎలాన్ మస్క్ ఆందోళన.. ఉద్యోగులకు గట్టి వార్నింగ్

ఇదిలాఉంటే ఇటీవల మస్క్ ఉద్యోగులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీఒక్కరూ కష్టపడి పనిచేయాలని, వారంలో 80 గంటలు పనిచేయాలని, తాను కూడా ట్విట్టర్‌లో మార్పు కోసం వారంలో ఏడు రోజులు, వీలైనంత పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలకు కూడా సీఈవోగా ఉన్న ఎలాన్ మస్క్.. ఇప్పుడు ఎక్కువ భాగం సమయం ట్విట్టర్ కోసమే వెచ్చిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ట్విటర్ స్లో డౌన్‌పై మస్క్ స్పందించారు. అందుకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే.. ఈ పరిస్థితి త్వరలోనే సద్దుమణుగుతుందని అన్నారు. బ్లూటిక్ సమస్య కూడా వచ్చేవారం చివరిలోగా పరిష్కారం అవుతుందని మస్క్ తెలిపిన విషయం విధితమే.