Elon Musk: ఎలాన్ మస్క్ క్షమాపణలు చెప్పాడు..! ఎందుకంటే..

ట్విటర్‌లో పలువురు నెటిజన్లు సంధించిన ప్రశ్నలకు మస్క్ సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో.. చాలా దేశాల్లో ఈ మైక్రోబ్లాంగింగ్ సైట్ పనితీరు నిదానంగా ఉండటంతో మస్క్ స్పందించారు. ట్విటర్ వేదికగా క్షమాపణలు తెలియజేశాడు.

Elon Musk: ఎలాన్ మస్క్ క్షమాపణలు చెప్పాడు..! ఎందుకంటే..

Elon Musk

Elon Musk: ప్రపంచ అపర కుబేరుడు, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ట్విటర్ యూజర్లకు క్షమాపణలు చెప్పాడు. మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న నాటి నుంచి కొత్త విధానాలతో అటు ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. ఇటు ట్విటర్ యూజర్లను తికమక పెట్టేస్తున్నాడు. బ్లూ టిక్ విషయంలో, ఇతర విషయాల్లో దూకుడుగా ముందుకెళ్తున్నాడు.

Elon Musk: ట్విట్టర్ దివాలాపై ఎలాన్ మస్క్ ఆందోళన.. ఉద్యోగులకు గట్టి వార్నింగ్

ట్విటర్‌లో పలువురు నెటిజన్లు సంధించిన ప్రశ్నలకు మస్క్ సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో.. చాలా దేశాల్లో ఈ మైక్రోబ్లాంగింగ్ సైట్ పనితీరు నిదానంగా ఉండటంతో మస్క్ స్పందించారు. ట్విటర్ వేదికగా క్షమాపణలు తెలియజేశాడు. అంతకుముందు.. ట్విటర్ మరింత సజీవంగా అనిపిస్తుంది అంటూ మస్క్ ట్వీట్ చేశారు. ఇక ఎనిమిది డాలర్ల ట్విటర్ బ్లూ ప్రోగ్రామ్ ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపైనా మస్క్ ఓ యూజర్ కి రిప్లై ఇచ్చారు. అలాగే.. యూజర్లకు అందుబాటులోకి రాబోయే మరో కొత్త ఫీచర్ ను త్వరలోనే లాంచ్ చేస్తానని మస్క్ ప్రకటించాడు.

కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు ప్రకటించిన మస్క్.. ఏయే ట్విటర్ అకౌంట్స్, ఏ యే సంస్థలకు అనుసంధానంగా ఉన్నాయో గుర్తించేందుకు ఆయా సంస్థలను అనమతి నిస్తుందని మస్క్ తెలిపాడు. ఈ ఫీచర్ ను త్వరలోనే లాంచ్ చేస్తామన్నారు. ఇదిలాఉంటే.. ట్విటర్ లో ప్రధాన టాపిక్ గా ఉన్న బ్లూ టిక్ సేవలను నిలిపివేయడంపై మస్క్ స్పందిస్తూ.. బ్లూ టిక్ వచ్చేవారం నాటికి పునరుద్దరణ అవుతుందని తెలిపాడు.