Giriraj Singh: సీఎం మెటీరియలే కానీ వ్యక్తి పీఎం మెటీరియల్ ఎలా అవుతాడు? నితీశ్‭పై కేంద్ర మంత్రి సెటైర్లు

బీజేపీతో విడిపోయి ఆర్జేడీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం.. నితీశ్ తొందర్లోనే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని, తేజశ్వీ యాదవ్‭ని బిహార్ ముఖ్యమంత్రిగా చేసి తాను ప్రధానమంత్రి అభ్యర్థిత్వంలో ఉంటారని వార్తలు వచ్చాయి. వీటికి అనుగుణంగానే తాజాగా తేజశ్వీ యాదవ్ స్పందిస్తూ విపక్షాలు అంగీకరిస్తే నితీశ్ కుమార్ బలమైన ప్రధాన మంత్రి అభ్యర్థి అవుతారని అనడం విశేషం.

Giriraj Singh: సీఎం మెటీరియలే కానీ వ్యక్తి పీఎం మెటీరియల్ ఎలా అవుతాడు? నితీశ్‭పై కేంద్ర మంత్రి సెటైర్లు

Nitish is not even CM material then how can he become PM material slams by Giriraj Singh

Giriraj Singh: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭పై అదే రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సెటైర్లు గుప్పించారు. 2024 నాటికి నితీశ్ కుమార్ ప్రధానమంత్రి రేసులో ఉంటారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గిరిరాజ్ స్పందిస్తూ ముఖ్యమంత్రి మెటీరియల్ కాని వ్యక్తి ప్రధానమంత్రి మెటీరియల్ ఎలా అవుతారని ఎద్దేవా చేశారు. దీనికి ఆయన ఒక కారణాన్ని చూపించారు. ఎనిమిదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్.. ఒక్కసారి కూడా తన సొంత సంఖ్యా బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు.

ఈ విషయమై ఆయన బిహార్ రాజధాని పాట్నాలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘‘నితీశ్ కుమార్ చాలా సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. బిహార్ ముఖ్యమంత్రిగా 8 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఒక్క సారంటే ఒక్కసారి కూడా తన సంఖ్యా బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. జేడీయూని సొంతంగా అధికారంలోకి తీసుకురాలేకపోయారు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే.. ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి నితీశ్‭కు అర్హతే లేదు. ఆయన అసలు ముఖ్యమంత్రి అభ్యర్థే కాదు.. ఇక ప్రధానమంత్రి అభ్యర్థి ఎలా అవుతారు?’’ అని ప్రశ్నించారు.

బీజేపీతో విడిపోయి ఆర్జేడీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం.. నితీశ్ తొందర్లోనే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని, తేజశ్వీ యాదవ్‭ని బిహార్ ముఖ్యమంత్రిగా చేసి తాను ప్రధానమంత్రి అభ్యర్థిత్వంలో ఉంటారని వార్తలు వచ్చాయి. వీటికి అనుగుణంగానే తాజాగా తేజశ్వీ యాదవ్ స్పందిస్తూ విపక్షాలు అంగీకరిస్తే నితీశ్ కుమార్ బలమైన ప్రధాన మంత్రి అభ్యర్థి అవుతారని అనడం విశేషం.

Ram Setu: అలా అయితే 2024లో మోదీ ఓడటం ఖాయం: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి