Deers For Cheetahs: చీతాలకు ఆహారంగా జింకలు.. అభ్యంతరం వ్యక్తం చేసిన బిష్ణోయ్ వర్గం.. ప్రభుత్వ సమాధానమిదే!

చీతాలకు ఆహారంగా జింకల్ని రాజస్థాన్ నుంచి తెప్పించారంటూ జరుగుతున్న ప్రచారంపై బిష్ణోయ్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేసింది. అయితే, దీనిపై ప్రభుత్వం స్పందించింది.

Deers For Cheetahs: చీతాలకు ఆహారంగా జింకలు.. అభ్యంతరం వ్యక్తం చేసిన బిష్ణోయ్ వర్గం.. ప్రభుత్వ సమాధానమిదే!

Deers For Cheetahs: ఇటీవలే నమీబియా నుంచి ఎనిమిది చీతాల్ని ఇండియా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటికి ఆహారంగా రాజస్థాన్ నుంచి ఒక రకమైన జింకలు (చితల్) తీసుకొచ్చి, అక్కడ వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Pregnancy Cheating: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. ప్రెగ్నెన్సీ లేకుండానే తొమ్మిది నెలలు చికిత్స.. తీరా డెలివరీ టైమ్‌లో బయటపడ్డ నిజం

ఈ జింకల ఒంటిపై చిన్న మచ్చలు ఉంటాయి. అయితే, రాజస్థాన్ నుంచి జింకల్ని తీసుకురావడంపై అక్కడి బిష్ణోయ్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి కారణం.. జింకల్ని బిష్ణోయ్ వర్గం దైవంతో సమానంగా భావించడమే. వీటిని ఆ వర్గం ప్రజలు పూర్వ కాలం నుంచి తమ ఆరాధ్య దైవానికి ప్రతినిధిగా భావిస్తారు. అందువల్ల వీటిని చీతాలు వేటాడేందుకు అనువుగా, రాజస్థాన్ నుంచి తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు నగరాల్లో ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందజేశారు.

Bullettu Bandi Couple: లంచం తీసుకుంటూ దొరికిన ‘బుల్లెట్టు బండి’ పెళ్లి కొడుకు

ప్రభుత్వ నిర్ణయం సరికాదని విమర్శించారు. అయితే, ఈ అంశంపై మధ్య ప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. రాజస్థాన్ నుంచి చీతాల్ని తీసుకొచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రకటించింది. ఇప్పటికే చీతాలను విడుదల చేసిన కునో నేషనల్ పార్కులో 20,000కుపైగా జింకలు ఉన్నాయని, అలాంటప్పుడు కొత్తగా రాజస్థాన్ నుంచి వాటిని తీసుకురావాల్సిన అవసరం ఏముందని మధ్యప్రదేశ్ అటవీ శాఖ స్పష్టం చేసింది.