పాత నోట్లు, నాణాలు ఉంటే లక్షాధికారి కావొచ్చు!

10TV Telugu News

Old coins can make you millionaire : పాత నోట్లు, నాణాలున్నాయా..అయితే..మీరు లక్షాధికారి అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వీటికి అధిక డిమాండ్ ఉంటోది. పురాతన కాలం నాటికి చెందిన వీటిని లక్షలు, కోట్లు చెల్లించి సొంతం చేసుకుంటున్నారు. ఈ కామర్స్ వెబ్ సైట్స్ సొంతం చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పురాతన, పాత నాణేలు ఉంటే వేలం పెట్టేందుకు ప్రయత్నించాలంటున్నారు.వైష్ణో దేవి ముద్రను కలిగిన నాణేలు ఉంటే వాటిని వేలానికి ఉంచే అవకాశముంది. ఇప్పుడు వీటికి అధిక డిమాండ్ ఏర్పడుతోంది. హిందూ ధర్మం ప్రకారం వైష్ణోదేవి ఇంట్లో ఉంటే… ఎంతో మేలు చేకూరుస్తుందనీ, కష్టాలను తరిమేస్తుందని విశ్వసిస్తుంటారు. ఇలాంటి నాణేలు సొంతం చేసుకోవడానికి లక్షలు ఖర్చుచేసేందుకు సిద్ధంగా ఉన్నారు కొంతమంది.ఇక 786 సిరీస్ విషయానికి వస్తే..ముస్లిం సమాజంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సిరీస్ ఉన్న కరెన్సీ నోట్లను పవిత్రంగా భావిస్తారు. ఎవరి దగ్గరనైనా ఈ నోట్లు ఉంటే..వాటిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సొంతం చేసుకుంటే..అన్ని లాభాలే జరుగుతాయని వారు నమ్ముతుంటారు. ఈ సిరీస్ ఉండే నాణేలు లేదా నోట్లు మీ దగ్గర ఉంటే… ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న ఈ-కామర్స్ వెబ్ సైట్లలో ఉంచడం ద్వారా డబ్బు సంపాదించవచ్చంటున్నారు.