Omicron Variant: డెల్టా కంటే పిల్లలపై ఒమిక్రాన్ ప్రమాదమే ఎక్కువ !

ఒమిక్రాన్ వేరియంట్ ఢిల్లీలోని చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జనవరి 9-12తేదీల మధ్యలోనే ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ చిన్న పిల్లలపై...

Omicron Variant: డెల్టా కంటే పిల్లలపై ఒమిక్రాన్ ప్రమాదమే ఎక్కువ !

Omicrion

Updated On : January 16, 2022 / 9:14 PM IST

Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ ఢిల్లీలోని చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జనవరి 9-12తేదీల మధ్యలోనే ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ చిన్న పిల్లలపై అంతగా ప్రభావం చూపించదనే మాటను పక్కకుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలను కరోనా నుంచి కాపాడుకోవడానికి అదనపు భద్రతను కల్పించాలి.

డెల్టా వేరియంట్ కంటే వేగవంతంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ తీవ్రత తక్కువే. అలా అని నిర్లక్ష్యపెట్టడానికి వీల్లేదు. చిన్నపిల్లల్లోనే కొవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఒమిక్రాన్ లక్షణాలతో సతమతమవుతున్నారు.

5ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ కూడా విస్తృతంగా జరగకబోతుండటంతో రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది. పెద్ద వాళ్లలో లక్షణాలు కనిపించకపోగా వారిలో ఇబ్బందులు తక్కువగానే ఉంటున్నాయి. అదే పిల్లల్లో వాంతులు, జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.

ఇది కూడా చదవండి : కోవిడ్ వ్యాక్సినేషన్‌‌లో మరో మైలురాయి

బయట నుంచి రాగానే శానిటైజ్ చేసుకోకుండా పిల్లలను ముట్టుకోవడం, కొవిడ్ అనుమానంతో ఉన్నా వారితో చనువుగా ఉండటం, ఇంట్లో పెద్దలు బయటకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించకపోవడం వంటివి పిల్లలపైనా ప్రభావం చూపిస్తాయనే విషయం మర్చిపోకండి.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 2 లక్షల 71 వేల 202 కేసులు నమోదయ్యాయి. 314 మంది చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 15 లక్షల 50 వేలు దాటింది. డెయిలీ పాజిటివిటీ రేటు 16.28 శాతానికి పెరిగింది. అందులో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7 వేల 743కి చేరింది. తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో.. దాదాపుగా అన్ని రాష్ట్రాలూ ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా.. తప్పెవరిది?

గతంలో డెల్టా వేరియంట్‌, ఇతర ఆల్పా, గామా, బీటా, కప్ప వేరియంట్ సోకిన వారు మళ్లీ వైరస్ బారిన పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇక.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కు వచ్చిందని వైరాలజిస్టులు భావిస్తున్నారు.