India Covid : కోవిడ్ వ్యాక్సినేషన్‌‌లో మరో మైలురాయి

జనవరి 1న కోవిషీల్డ్‌కు, జనవరి 2న కోవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు మంజూరయ్యాయి. మూడు దశల తర్వాత స్పుత్నిక్-వి, ఫైజర్‌, మోడెర్నా, జైడస్‌ కాడిల్లా, కొవావాక్స్‌,

India Covid : కోవిడ్ వ్యాక్సినేషన్‌‌లో మరో మైలురాయి

Covid

India Vaccination Drive : భారత్‌లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ లో మరో మైలురాయిని చేరుకుంది. వ్యాక్సినేషన్ ప్రారంభించి నేటికి సరిగ్గా ఏడాది… 2021 జనవరి 16న దేశంలో తొలిసారి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఏడాదిలో మన దేశంలో 156కోట్ల 80లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. దేశంలో మొదట ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ముందు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత దశల వారీగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో 15 నుంచి 18ఏళ్లు పైబడిన వారికి తొలి డోస్ ఇస్తున్నారు. అలాగే ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్‌ డోస్‌ ఇస్తున్నారు.

Read More : Omicron : ఒమిక్రాన్‌పై బయట పడుతున్న కొత్త విషయాలు

మొదట కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లు మనకు అందుబాటులోకి వచ్చాయి. జనవరి 1న కోవిషీల్డ్‌కు, జనవరి 2న కోవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు మంజూరయ్యాయి. మూడు దశల తర్వాత స్పుత్నిక్-వి, ఫైజర్‌, మోడెర్నా, జైడస్‌ కాడిల్లా, కొవావాక్స్‌, కార్బోవాక్స్‌ టీకాలకు అనుమతి దొరికినా అవి అంత అందుబాటులో లేవు. ఇప్పటి వరకూ మన దేశంలో 156 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. 18 ఏళ్లకు పైబడిన వారిలో 65 కోట్ల మందికి పైగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.

Read More : TSRTC : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

ఇక మరో 22 కోట్ల మంది సింగిల్‌ డోసు తీసుకున్నారు. ఇక 15 నుంచి 18 ఏళ్ల మధ్య టీనేజర్స్‌కు జోరుగా వ్యాక్సినేషన్ సాగుతోంది. 3కోట్ల 26లక్షల మంది తొలిడోస్‌ తీసుకున్నారు. ప్రికాషన్ డోసు కూడా 38లక్షలు దాటేసింది. దేశవ్యాప్తంగా అర్హులైన వారిలో 63శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోగా… 63శాతం మంది కనీసం ఒక్క డోసైనా తీసుకున్నారు. మొత్తంగా దేశంలో వ్యాక్సినేషన్‌కు అవుతున్న ఖర్చు 35వేల కోట్ల నుంచి 40వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.