Omicron : ఒమిక్రాన్‌పై బయట పడుతున్న కొత్త విషయాలు

ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాప్తి చెందితే.. అంత ఎక్కువగా రూపాంతరం చెందుతుందని.. దీనివల్ల మరిన్ని వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని నిపుణలు...

Omicron : ఒమిక్రాన్‌పై బయట పడుతున్న కొత్త విషయాలు

India Omicron

New Things On Omicron : దేశవ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 2 లక్షల 71 వేల 202 కేసులు నమోదయ్యాయి. 314 మంది చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 15 లక్షల 50 వేలు దాటింది. డెయిలీ పాజిటివిటీ రేటు 16.28 శాతానికి పెరిగింది. అందులో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7 వేల 743కి చేరింది. తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో.. దాదాపుగా అన్ని రాష్ట్రాలూ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూతో కరోనా కట్టడి చర్యలు చేపట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో… షాకింగ్ న్యూస్ చెప్పారు వైరాలజిస్టులు.

Read More : China Manja : గొంతులు తెగుతున్నా మార్పు రావడం లేదు.. చైనా మాంజాపై చర్యలేవి?

ఒమిక్రాన్‌తో వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ జనాలను బెంబేలెత్తిస్తోంది. అసలు కరోనా ఎప్పుడు పోతుందా అని అందరూ చర్చించుకుంటుంటే.. డెల్టా వేరియంట్‌తో పాటు.. ఒమిక్రాన్ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రెండు వేరియంట్‌లు ఒకేసారి వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని వైరాలజిస్ట్ డాక్టర్ జాకబ్ జాన్ చెబుతున్నారు. ఈ రెండు వేరియంట్‌లతో వస్తున్న ఇన్‌ఫెక్షన్లు కూడా వేరు వేరుగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త వేరియంట్‌తో న్యుమోనియా-హైపొక్సియా, మల్టీ ఆర్గాన్ డ్యామేజ్‍‌, శ్వాసకోస వ్యాధులకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు సంభవిస్తున్నాయి.

Read More : TSRTC : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

ఒమిక్రాన్ డెల్టా వేరియంట్‌తో కలవకపోవడంతో… మరో కొత్త వేరియంట్ పుట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాప్తి చెందితే.. అంత ఎక్కువగా రూపాంతరం చెందుతుందని.. దీనివల్ల మరిన్ని వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని నిపుణలు చెబుతున్నారు. ఒమిక్రాన్ కారణంగా ప్రజలు మళ్లీ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. గతంలో డెల్టా వేరియంట్‌, ఇతర ఆల్పా, గామా, బీటా, కప్ప వేరియంట్ సోకిన వారు మళ్లీ వైరస్ బారిన పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇక.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కు వచ్చిందని వైరాలజిస్టులు భావిస్తున్నారు.