అడ్రస్ దొరికింది : తల్లి చెంతకు చేరిన గీత!

20 ఏళ్ల క్రితం నుంచి పాకిస్తాన్‌కి తప్పిపోయి... ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో భారత్‌కు తిరిగివచ్చిన గీతా కుటుంబం ఆచూకీ దొరికింది. మహారాష్ట్రలో గీతా కుటుంబాన్ని కనుగొన్నట్లు ఈదీ ఫౌండేషన్‌ తెలిపింది.

అడ్రస్ దొరికింది : తల్లి చెంతకు చేరిన గీత!

India from Pakistan

Geeta Finds Her Parents : 20 ఏళ్ల క్రితం నుంచి పాకిస్తాన్‌కి తప్పిపోయి… ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో భారత్‌కు తిరిగివచ్చిన గీతా కుటుంబం ఆచూకీ దొరికింది. మహారాష్ట్రలో గీతా కుటుంబాన్ని కనుగొన్నట్లు ఈదీ ఫౌండేషన్‌ తెలిపింది. మహారాష్ట్రలోని నైగాన్ గ్రామంలో ఆమె తల్లిని ఆచూకీ కనుగొన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నైగాన్ గ్రామంలో ఆమె తల్లితో ఉంటోంది గీతా. ఆమె తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. తన కుమార్తె చివరకు తమ చెంతకు చేరడంతో.. గీతా ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేస్తోంది. 20 ఏళ్ల క్రితం ఇండియా నుంచి తప్పిపోయిన ఆ బాలిక పాక్ వెళ్లిపోయింది. ఆ బాలికను అక్కడి స్వచ్ఛంద సంస్థ ఈధీ ఫౌండేషన్ చేరదీసింది.

గీతా పుట్టికతో మూగ, చెవిటి కావడంతో… ఆమె ఆ సమయంలో పేరు చెప్పలేదు. దీంతో ఫాతిమా అని పేరు పెట్టారు. 15 సంవత్సరాలు పాకిస్థాన్ లోని లాహోర్ లో ఉన్న ఆమె కట్టు, బొట్టు, ఆహార అలవాట్లు చూసి అక్కడున్న నిర్వాహకులు గీత అని పేరు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో బాలిక ఫోటోను వైరల్ చేశారు. ఆనాటి విదేశాంగమంత్రి సుష్మస్వరాజ్‌ చొరవతో ఆరేళ్ల క్రితం ఆమెను భారత్‌కు తీసుకువచ్చారు. ఆ ఫోటోలు భారత్‌లో ఓ తప్పిపోయిన అమ్మాయి ఫోటోలను పోలి ఉండటంతో.. భారత్ కొన్ని ఫోటోలను పాక్‌కు పంపింది. భారత ప్రభుత్వం పంపించిన ఫోటోలలో బీహార్ రాష్ట్రానికి చెందిన జనార్ధన్ మహతోను తన తండ్రిగా గుర్తించింది.. గీత. ఆ ఫోటోలో ఉన్న మిగిలిన కుటుంబ సభ్యులను కూడా తన సోదరుడు అక్క చెల్లెళ్ళుగా గుర్తించింది.

మొదట తన తల్లిదండ్రులను గుర్తించిన గీత.. ఆ తర్వాత జనార్ధన్ మహతో తన తండ్రి కాదని భావించింది. ఆయనతో వెళ్లేందుకు నిరాకరించింది. ఊహించని ఈ పరిణామానికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమెను జనార్ధన్ మహతో కుటుంబానికి అప్పగించే ముందు ఆమెకు, ఆమె తండ్రికి DNA పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత గీత తండ్రి జనార్ధన్ మహతో కాదని తెలియడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఓ స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో గీత ఉంది.
గీతను అన్ని ప్రాంతాలు తిప్పించి పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చే అధికారులు ప్రయత్నం చేశారు. అల్పాహారంగా ఇడ్లీ అన్న పేరు చెప్పడంతో.. ఆమెది దక్షిణాది ప్రాంతంగా భావించారు. అప్పటి నుంచి తన తల్లిదండ్రులను చేరాలని ఆరాటపడుతోంది

గీత. ఆమె సైగల ద్వారా చెప్పిన వివరాల ఆధారంగా ఆ యువతిని బాసరకు తీసుకువచ్చారు. ఆమె ఇంటి దగ్గర నది, ఆలయం, రైల్వే స్టేషన్, ఆసుపత్రి ఉన్నట్లు చెప్పడంతో ఆమెను బాసరకు తీసుకువచ్చి ఆయా ప్రాంతాల్లో తిప్పి తిరిగి తీసుకువెళ్లారు. ఆమె చెప్తున్న ఆనవాలు, స్థానికంగా ఉన్న నిర్మాణాలను బట్టి ఆమె తెలుగు కుటుంబానికి, తెలంగాణకు చెంది ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన ఓ దంపతులు గీతా తమ బిడ్డే అని కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

బాసరకు తీసుకొచ్చిన తర్వాత.. గీత తమ కుమార్తె అంటే తమ కుమార్తేనంటూ దాదాపు 40 కుటుంబాలవారు ముందుకొచ్చారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, బిహార్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన పలువురు ఆమె తమ కుటుంబసభ్యురాలేనని చెబుతుండడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. చివరకు గీతా కుటుంబసభ్యుల ఆచూకీ తెలవడంతో ఈ కేసుకు ఫుల్‌స్టాప్‌ పడింది.