Uttarakhand: ఒక్క రాత్రికి రూ. 500 చెల్లిస్తే చాలు.. మీరు నిజమైన జైలు జీవితాన్ని అనుభవించొచ్చు.. జాతకంలో దోషాలూ పోతాయట ..!

1903లో నిర్మించిన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జైలులో ఒక పాడుబడిన భాగం ఉంది. దీనిని "జైలు అతిథుల కోసం" సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఖైదును అంచనా వేసే 'బంధన్ యోగం' నుండి బయటపడేందుకు జ్యోతిష్యులు జైలులో గడపాలని సూచించిన వ్యక్తులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెప్పారు.

Uttarakhand: ఒక్క రాత్రికి రూ. 500 చెల్లిస్తే చాలు.. మీరు నిజమైన జైలు జీవితాన్ని అనుభవించొచ్చు.. జాతకంలో దోషాలూ పోతాయట ..!

Uttarakhand

Uttarakhand: జైలుకు వెళ్లాలని ఎవరూ కోరుకోరు. కానీ, కొందరు నేరం చేయకుండా, సరదాగా వెళ్లి జైలు జీవితం అనుభవాన్ని పొందాలనుకుంటూ ఆశపడతారు.? కొందరు జ్యోతిష్యులు జాతకంలోని దోషాలు పావాలంటే కొన్ని ఉపచారాలు చెప్తుంటారు. వాటిల్లో జైలు జీవితం గడిపితే జాతకంలో దోషాలు పోతాయని చెబుతారు. అయితే, నేరం చేయకుండా జైలుకెళ్లేందుకు అవకాశం లేదు. కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ. 500 చెల్లిస్తే చాలు, ఒక్క రాత్రి జైలులో గడిపే అవకాశాన్ని కల్పిస్తోంది.

Rajasthan Congress crisis: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో ఎలాంటి నాటకీయత లేదు.. ఒకటి రెండు రోజుల్లో సమస్య సమసిపోతుందన్న కేసీ వేణుగోపాల్

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలోని జైలు పరిపాలన విభాగం ప్రజలకు ఒక రాత్రికి రూ. 500 రుసుముతో “చెడు కర్మ” నుంచి బయటపడటానికి నిజ జీవిత జైలు అనుభవాన్ని అందిస్తోంది. నిజమైన నిందితులను జైళ్లో ఎలా ట్రీట్ చేస్తారో అచ్చం అలానే మనల్ని జైలు అధికారులు ట్రీట్ చేస్తారు. దుస్తులు, భోజనం వంటి సౌకర్యాలు ఖైదీలకు అందించే విధంగా మనకూ అందిస్తారు. ఖైదీలకు మాదిరిగానే బట్టలు కూడా అందిస్తారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

1903లో నిర్మించిన ఉత్తరాఖండ్‌లోని హల్వ్దవానీ జైలులో ఒక పాడుబడిన భాగం ఉంది. దీనిని “జైలు అతిథుల కోసం” సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఖైదును అంచనా వేసే ‘బంధన్ యోగం’ నుండి బయటపడేందుకు జ్యోతిష్యులు జైలులో గడపాలని సూచించిన వ్యక్తులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెప్పారు. పాత జైలులో ఆరు స్టాఫ్ క్వార్టర్‌లను వదిలివేయబడిందని, ప్రస్తుతం “జైలు అతిథులు’’కు వీటిని సిద్ధంగా ఉంచడం జరిగిందని జైలు డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ సతీష్ సుఖిజా తెలిపారు. సిఫార్సు చేయబడిన వ్యక్తులను జైలు బ్యారక్‌లో కొన్ని గంటలు గడపడానికి అనుమతించాలని జైలుకు తరచుగా సీనియర్ అధికారుల నుండి ఆదేశాలు వచ్చేవని, అన్నారు. దీంతో ఈ “పర్యాటక ఖైదీలకు” జైలు యూనిఫారాలు, జైలు వంటగదిలో చేసిన ఆహారాన్ని అందజేస్తామని అన్నారు.