Rajasthan Congress crisis: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో ఎలాంటి నాటకీయత లేదు.. ఒకటి రెండు రోజుల్లో సమస్య సమసిపోతుందన్న కేసీ వేణుగోపాల్

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో ఎలాంటి డ్రామా లేదని, ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు.

Rajasthan Congress crisis: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో ఎలాంటి నాటకీయత లేదు.. ఒకటి రెండు రోజుల్లో  సమస్య సమసిపోతుందన్న కేసీ వేణుగోపాల్

Ashok Gehlot

Rajasthan Congress crisis: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముందు రాజస్థాన్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సంక్షోభం మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు. అక్టోబరు 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ దాఖలు చేస్తారా? లేదా? అనే ఉత్కంఠ నేపథ్యంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం జరగనుంది. గెహ్లాట్‌కు విధేయులైన ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేశారు. పార్టీ అధ్యక్షుడిగా గెహ్లాట్ ఢిల్లీకి వెళితే రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్‌ను నియమించాలని కేంద్ర పార్టీ ఆలోచనలో ఉంది. అయితే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గెహ్లాట్ విధేయులైన పలువురు ఎమ్మెల్యే అధిష్టానంపై తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం నెలకొంది.

Asaduddin Owaisi: పీఎఫ్ఐ‌పై ఐదేళ్ల నిషేధాన్ని తప్పుపట్టిన ఓవైసీ.. తమ అభిప్రాయాన్ని చెప్పాలనుకునే ముస్లింలపై నిషేధమని వ్యాఖ్య..

తాజాగాఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ శేణుగోపాల్ మాట్లాడుతూ.. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో డ్రామా ఏమీలేదని, ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. అయితే, మీడియా దీన్ని డ్రామాగా చూడొచ్చు.. కానీ కనీసం ఐఎన్‌సీ అధ్యక్ష ఎన్నికలపైనా చర్చిస్తున్నారు. మేము చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్నాం. రెండు రోజుల్లో సజావుగా ముగుస్తుందని వేణుగోపాల్ అన్నారు. సీఎం గెహ్లాట్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గెహ్లాట్ రాజీనామా చేయడం లేదని, దాని గురించి అలాంటి చర్చలు లేవని గెహ్లాట్ విధేయుడు, రాష్ట్ర మంత్రి పీఎస్ ఖచరియావాస్ అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో సోనియాతో భేటీ అయ్యే గెహ్లాట్.. 102 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వానికి ఆయన వివరిస్తారని తెలుస్తోంది. అయితే, రాజస్థాన్ లో గెహ్లాట్ కు మద్దతుగా పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు అందజేశామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ అన్నారు. నేను అశోక్ గెహ్లాట్‌తో మాట్లాడాను, నలుగురైదుగురు ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించారు. షోకాజ్ నోటీసు ఇచ్చామని అన్నారు.