పెళ్లికి ముందు సెక్స్.. రేప్‌ చేసినట్లే : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

  • Published By: raju ,Published On : April 12, 2019 / 06:23 AM IST
పెళ్లికి ముందు సెక్స్.. రేప్‌ చేసినట్లే : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లికి ముందు సెక్స్ రేప్‌తో సమానం అని స్పష్టం చేసింది. అమ్మాయి, అబ్బాయి ఇష్టపూర్వకంగా కలిసినా.. వివాహానికి ముందు సెక్స్ అనేది నేరం అని, దాన్ని అత్యాచారంగా  పరిగణిస్తామని న్యాయస్థానం చెప్పింది. సుప్రీంకోర్టు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, ఎంఆర్ షా లతో కూడిన బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బిలాస్ పూర్ కోని ప్రాంతానికి చెందిన అమ్మాయికి డాక్టర్ అనురాగ్  సోని తో పరిచయం ఏర్పడింది. 2009 నుంచి ఇద్దరూ టచ్ లో ఉన్నారు.

ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని డాక్టర్ మాటిచ్చాడు. దీంతో ఆమె అతడి నమ్మింది సెక్స్ లో పాల్గొంది. కొన్ని రోజుల  తర్వాత పెళ్లి గురించి ప్రస్తావిస్తే ఆ డాక్టర్ తప్పించుకుని తిరగం ప్రారంభించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు కోర్టుని ఆశ్రయించింది. న్యాయం చేయాలని అడిగింది. కేసుని విచారించిన కోర్టు.. పెళ్లి  పేరుతో అమ్మాయితో సెక్స్ చేసి మోసం చెయ్యడాన్ని తప్పుపట్టింది. పెళ్లికి ముందు సెక్స్ నేరం అని, రేప్ తో సమానం అని చెప్పింది.
Read Also : రెడీ టు అప్లయ్ : SBIలో 8వేల 904 క్లర్క్ పోస్టులు

ఈ కేసులో డాక్టర్ అనురాగ్ కి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీసీ 376 సెక్షన్(శిక్షార్హం) కింద కేసు నమోదు చేశారు. ఇటీవలి కాలంలో ఇలాంటి తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని న్యాయమూర్తి  అన్నారు. ఈ పోకడపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారని వాపోయారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండాలంటే కఠిన శిక్షలు అమలు  చెయ్యాల్సిందే అని స్పష్టం చేశారు. మోసపోయిన బాధితురాలి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని అన్నారు. ఆమె జీవితాంతం క్షోభను అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు. సమాజంలో ఆమెకు విలువ ఇచ్చే  పరిస్థితి ఉండదన్నారు.

ప్రీ మ్యారిటల్ సెక్స్.. ఏ దేశంలో అయినా, ఏ మతంలో అయినా, ఏ సమాజంలో అయినా.. మంచిది కాదనే అభిప్రాయం ఉంది. ఇటీవలి కాలంలో డేటింగ్, లివింగ్ రిలేషన్ షిప్స్ లో శృంగారం చాలా చిన్న విషయంగా మారింది. డేటింగ్, లివింగ్ రిలేషన్ షిప్ ల ముఖ్య ఉద్దేశం సెక్స్ కాకపోయినా, అక్కడ కూడా హద్దులున్నా.. అవి చెరిగిపోవడానికి చాలా అవకాశాలున్నాయి. కట్టుబాట్లు, సంప్రదాయాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండే భారత్ వంటి దేశంలో పెళ్లికి ముందు ప్రేమ కూడా తప్పే అనేవాళ్లు లేకపోలేదు. ఒక్కోసారి పరువు హత్యలకు కూడా దారి తీస్తోంది.
Read Also : ఆకతాయి అసభ్య ప్రవర్తన : చెంప పగలగొట్టిన ఖుష్బూ