అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ శతాబ్ది వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా మోడీ

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ శతాబ్ది వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా మోడీ

Aligarh Muslim University ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ శతాబ్ది వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొననున్నారు. డిసెంబర్-22న జరుగనున్న అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ శతాబ్ది వేడుకల్లో ముఖ్య అతిధిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ పాల్గొంటారని ఇవాళ(డిసెంబర్-16,2020)యూనివర్శిటీ ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తో కలిసి ఆన్ లైన్ ఫంక్షన్ లో మోడీ పాల్గొనబోతున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

అలీఘర్ యూనివర్శిటీ ఏర్పాటై 100ఏళ్లు అవుతున్న సందర్భంగా జరగనున్న సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు అంగీకరించిన ప్రధాని మోడీకి AMU కమ్యూనిటీ కృతజ్ణతలు చెబుతుందని AMU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ తెలిపారు. ఈ చారిత్రక సంవత్సరంలో విశ్వవిద్యాలయం యొక్క కార్యక్రమం..దాని డెవలప్ మెంట్ మరియు ప్రైవేటు, ప్రభుత్వ రంగాలలో తమ విద్యార్థులను నియమించడంలో కూడా ఎంతో సహాయపడుతుందఅని ఆయన అన్నారు.

జరుగబోయే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు… స్టాఫ్ మెంబర్స్,విద్యార్థులు,పూర్వ విద్యార్ధులు మరియు ఏఎంయూ వెల్ విషర్స్ అందరూ పాల్గొన్ని వేడులకను విజయవంతం చేసేలా కృషి చేయాలని యూనివర్శిటీ కమ్యూనిటీకి ప్రొఫెసర్ మన్సూర్ విజ్ణప్తి చేశారు. కాగా, శతాబ్ది వేడుకల్లో ముఖ్య అతిధిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొనే అవకాశముందని ఈ నెల ప్రారంభంలో యూనివర్శిటీ ప్రకటించిన విషయం తెలిసిందే.