ప్రపంచదేశాల పెట్టుబడిదారులతో మోడీ సమావేశం

ప్రపంచదేశాల పెట్టుబడిదారులతో మోడీ సమావేశం

pm modi:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలో అతిపెద్ద పెట్టుబడిదారులతో మీటింగ్ కు రెడీ అయ్యారు. ఇండియాలో సుదీర్ఘ కాల పెట్టుబడుల కోసం ఈ మీటింగ్ జరగనుంది. కొవిడ్-19 మహమ్మారి సమయంలో డెవలప్‌మెంట్ పూర్తిగా స్తంభించడంతో ప్రాజెక్టులు ఆలస్యమైయ్యాయి.

‘స్థిరమైన లాభాలు పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి దారులను సమీకరిస్తున్నాం. సుదీర్ఘ కాలం వ్యాపారలావాదేవీలు కొనసాగించేదిశగా పనిచేస్తున్నాం’ తరుణ్ బజాజ్, సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) అని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన వర్చువల్ కాన్ఫిరెన్స్ లో చెప్పారు.ఇండస్ట్రీ నిపుణులంతా డెవలప్‌మెంట్‌ను స్వాగతిస్తున్నారు. సీఐఐ డైరక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ గ్లోబల్ ఇన్వెస్టర్లతో ప్రధానమంత్రి సమావేశం కాన్ఫిడెన్స్ బూస్టర్‌గా పనిచేయనుంది. ‘విదేశీ పెట్టుబడులు పెట్టడానికి రావడమనేది చక్కటి విషయం’ అని ఆయన అన్నారు.

ఇన్‌ఫ్రాస్టక్చర్ తో పాటుగా హెల్త్ కేర్, డిజిటల్ స్పేస్ వంటి వాటిపై కూడా విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కనిపిస్తుంది. చైనా పెట్టబడులు ఆపేసిన తర్వాత ఏర్పడిన గ్యాప్‌ను ప్రస్తుత సమావేశంతో భర్తీ చేయనున్నారు.
https://10tv.in/pm-modi-richer-than-last-year-amit-shahs-net-worth-takes-a-hit-pmo/
‘ప్రధానమంత్రి పెట్టుబడిదారులతో సమావేశమవడమంటే.. మన దగ్గరకు తక్కు ప్రీమియంకే పెట్టబడులు వస్తున్నట్లు. ఇన్వెస్టర్లు తక్కువ ప్రీమియంనే డిమాండ్ చేస్తారు. దాంతో పాటు సుదీర్ఘ కాల కమిట్‌మెంట్ కూడా ఇస్తారు. సపోర్ట్‌తో పాటు టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తుంది’ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఛైర్మన్ నీలేశ్ షా అన్నారు.

80వ దశాబ్దంలో ఇండియా, చైనాలు ఒకేలా ఉండేవి. ఈ నాలుగు దశాబ్దాల్లో చైనా ఐదు రెట్టు పెరిగిపోయింది. ఇలాంటి సంబంధాలు.. చైనాతో వచ్చిన గ్యాప్‌ను భర్తీ చేస్తాయి.

మొబైల్ ఫోన్లు, ఫార్మా ప్రొడక్ట్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్ లాంటి సెక్టార్లను ఎక్స్‌టెండ్ చేస్తున్నారు. మొబైల్ మ్యాన్యుఫ్యాక్చర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడమే కాక, సప్లై చైన్ లో మార్పులు కనిపించనున్నాయి. సన్‌రైజ్ సెక్టార్లను కూడా ఈ స్కీంలోకి ఇన్వాల్వ్ చేయనున్నట్లు బజాజ్ చెప్పింది.