TMC activist kill : పశ్చిమబెంగాల్‌లో హింసాత్మక ఘటనలతో మొదలైన పోలింగ్.. పార్టీ ఆఫీస్ ముందే టీఎంసీ కార్యకర్త హత్య

పశ్చిమ బెంగాల్‌లో రెండో సమరం హింసాత్మక ఘటనలతో మొదలైంది. టీఎంసీ కార్యకర్త ఉత్తమ్‌ హత్య చేయబడ్డాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

TMC activist kill : పశ్చిమబెంగాల్‌లో హింసాత్మక ఘటనలతో మొదలైన పోలింగ్.. పార్టీ ఆఫీస్ ముందే టీఎంసీ కార్యకర్త హత్య

Tmc Activist Kill

Polling begins with violence in West Bengal : పశ్చిమ బెంగాల్‌లో రెండో సమరం హింసాత్మక ఘటనలతో మొదలైంది. టీఎంసీ కార్యకర్త ఉత్తమ్‌ హత్య చేయబడ్డాడు. పశ్చిమ మిడ్నాపూర్‌లోని తృణమూల్ పార్టీ కార్యాలయం ముందు దుండగులు ఉత్తమ్‌ను చంపేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ నేతలు తమ కార్యకర్తను చంపారని టీఎంసీ ఆరోపిస్తోంది. పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాలోని మోయ్‌నా పోలింగ్‌ బూత్‌లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు గొడవ పడ్డారు. ఈ ఘటనలో టీఎంసీ కార్యకర్త గాయపడ్డాడు. ఇదే ప్రాంతంలో బూత్‌ నంబర్ 231, 232లో టీఎంసీ కార్యకర్తను బూత్‌ నుంచి వెళ్లిపోవాలంటూ బీజేపీ నేతలు హెచ్చరించారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. నందిగ్రామ్‌లో బూత్ నంబర్ 248లో ఓటర్లను బీజేపీ అనుమతించడం లేదని టీఎంసీ కార్యకర్తలు ఆరోపించారు.

రెండో విడతలో భాగంగా ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. తూర్పు, పశ్చిమ మిడ్నపూర్‌, దక్షిణ 24 పరగణాలు, బంకురా జిల్లాల్లో విస్తరించి ఉన్న నియోజవర్గాల్లోని మొత్తం 10 వేల 620 పోలింగ్‌ స్థానాలూ సమస్యాత్మకమైనవిగా ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. దీంతో 646 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించారు. రెండో దశ పోలింగ్‌లో 171 మంది అభ్యర్థుల్లో 152 మంది పురుషులు, 19 మంది మహిళలు బరిలో ఉన్నారు. మొత్తం 71 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

బెంగాల్‌లో టీఎంసీ వర్సెస్ బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. 30 నియోజకవర్గాల్లో జరుగుతున్న పోలింగ్‌లో నందిగ్రామ్‌పైనే అందరి దృష్టి నెలకొంది. సీఎం మమత బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందును ఓడించాలని మమత ముమ్మర ప్రచారం చేశారు. మరోవైపు మమతను ఓడించి తన సత్తా చాలనుకుంటున్నారు సువేందు. సువేందు అధికారిని నందిగ్రామ్‌లో గట్టి పట్టుంది. భూమి పుత్రుడిననే నినాదంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

2016 ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి టీఎంసీ అభ్యర్థిగా బరిలో దిగిన సువేందు అధికారి 67శాతం ఓట్లు దక్కించుకుని విజయం సాధించారు. ఈ సారి 50 వేల ఓట్ల మెజార్టీ సాధించి మమత బెనర్జీని ఓడిస్తానని…అలా జరగకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సువేంధు ప్రకటించారు. మమతా బెనర్జీ తన సిట్టింగ్ స్థానాన్ని వదులుకొని నందిగ్రామ్‌ నుంచి బరిలో దిగారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.