ఆలుగడ్డ రైతుల ఆగ్రహం: బీజేపీకి అక్కడ కష్టమే

  • Published By: vamsi ,Published On : April 15, 2019 / 07:18 AM IST
ఆలుగడ్డ రైతుల ఆగ్రహం: బీజేపీకి అక్కడ కష్టమే

ఎన్నికల వేళ రైతులు తమ డిమాండ్‌లను నెరవేర్చుకునేందుకు రోడ్లెక్కుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో పసుపు రైతులు అధికార పార్టీ టీఆర్ఎస్‌పై తిరుగుబాటు భావుటా ఎగరవేయగా.. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఆలుగడ్డల రైతులు నిరసన భాట పట్టారు. రెండవ ఫేజ్‌లో జరగనున్న ఎన్నికల్లో ఆలుగడ్డ రైతులు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఎక్కువగా పండించే పంట ఆలుగడ్డలు ఈ ఆలుగడ్డలు ఎక్కువగా పండించే  ఆగ్రా ప్రాంతంలో ఎన్నికలు ఏప్రిల్ 18వ తేదీన జరిగే 8లోక్ సభ ఎన్నికల్లో 4లోక్ సభ స్థానాలు ఆలుగడ్డ రైతులు నివసించే పరిధిలోకి వస్తాయి. కాగా ఈ రెండవ ఫేజ్ ఎన్నికల్లో వీరి ప్రభావం అక్కడి అధికార పార్టీ బీజేపీపై పడే అవకాశం ఉంది. గత మూడేళ్లుగా ఆలు గడ్డ ధరలను పూర్తిగా తగ్గించేసి రైతులకు అన్యాయం చేశారనే ఉద్ధేశ్యంతో అక్కడి రైతులు ఉన్నారు.

ఈ క్రమంలో రెండవ పేజ్‌లో మొత్తం జరిగే 8స్థానాలలో 4స్థానాలపై వారి ప్రభావం ఉంటుంది. ఇందకుముందు కూడా ఆలు గడ్డ రైతులు ఆలుగడ్డలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ క్యాంప్ ఆఫీస్ ముందు పోసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల నుండి తమకు వచ్చిన నష్టాల ఫలితాలను ఎన్నికలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.