Power Cut In Nitish Kumar Meeting: సీఎం, డీప్యూటీ సీఎం పాల్గొన్న మీటింగ్‌లో పవర్ కట్
గురువారం పాట్నాలోని పాటలీపుత్ర ఇండోర్ స్టేడియంలో జూనియన్ బాలికల జాతీయ కబడ్డీ టోర్నమెంట్ నితీష్, తేజస్వి చేతుల మీదుగా ప్రారంభమైంది. అయితే, ప్రారంభానికి ముందు ఆ ప్రాంతం పవర్ కట్లో చిక్కుకుంది. సీఎం, డిప్యూటీ సీఎం అక్కడకు చేరుకునే సరికే ఆ పరిస్థితి ఉంది. చీకట్లోనే అధికారులు వారికి స్వాగతం పలకడం, ఇరువురూ వేదికపైకి చేరుకోవడం చకచకా జరిగిపోయాయి. వేదికపై ఉన్న నితీష్ అక్కడే విధుల్లో ఉన్న డీఎంను పవర్ కట్‌పై ప్రశ్నించారు

Power Cut In Nitish Kumar Meeting: బిహార్ రాష్ట్రంలో ఉన్న అంధకారం మసి ఏకంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు అంటుకుంది. తాజాగా గురువారం రాత్రి ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్‌లు పాల్గొన్న ఒక మీటింగ్‌లో ఏకంగా పది నిమిషాల పాటు విద్యుత్ ఆగిపోయింది. దీంతో చిమ్మచీకట్లోనే కార్యక్రమానికి వచ్చి, తమ తమ కుర్చీల్లో కూర్చోవాల్సిన అగత్యం ఏర్పడింది.
పాట్నాలోని పాటలీపుత్ర ఇండోర్ స్టేడియంలో జూనియన్ బాలికల జాతీయ కబడ్డీ టోర్నమెంట్ నితీష్, తేజస్వి చేతుల మీదుగా ప్రారంభమైంది. అయితే, ప్రారంభానికి ముందు ఆ ప్రాంతం పవర్ కట్లో చిక్కుకుంది. సీఎం, డిప్యూటీ సీఎం అక్కడకు చేరుకునే సరికే ఆ పరిస్థితి ఉంది. చీకట్లోనే అధికారులు వారికి స్వాగతం పలకడం, ఇరువురూ వేదికపైకి చేరుకోవడం చకచకా జరిగిపోయాయి. వేదికపై ఉన్న నితీష్ అక్కడే విధుల్లో ఉన్న డీఎంను పవర్ కట్‌పై ప్రశ్నించారు. అప్పటికే అప్రమత్తమైన సీఎంఏ అధికారులు తమ మొబైల్ లైట్స్ ఆన్ చేసి హడావిడి పడటం కనిపించింది. ఎట్టకేలకు 10 నిమిషాల తర్వాత అధికారులు విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఆ వెంటనే ప్రోగ్రాం మొదలైంది.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్జేడీ, జేడీయూల సుదీర్ఘ పాలనలో బిహార్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల సెగ ఇప్పుడు ఆ రెండు పార్టీల అధినేతలకే తగిలిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టారు కాబట్టి వారికైనా చీకటే ఎదురవుతుందంటూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు.
2002 Gujarat riots case: తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం