2002 Gujarat riots case: తీస్తా సెతల్వాద్‭కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం

ఇదే సమయంలో గుజరాత్ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం ఒక సూచన చేసింది. తీస్తా సెతల్వాద్‌ బెయిల్ విషయంలో కేవలం తాము ఆదేశించామని కాకుండా, ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగకుండా, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని కూడా గుజరాత్ హైకోర్టుకు తెలిపింది. ఈ విషయమై గురువారం విచారణ సమయంలో బెయిల్‭కు అవకాశం లేని పొటా, ఉపా వంటి కేసులు సెతల్వాద్‭పై లేవని సుప్రీం తెలిపింది

2002 Gujarat riots case: తీస్తా సెతల్వాద్‭కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం

Teesta Setalvad gets interim bail in 2002 Gujarat riots case

2002 Gujarat riots case: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‭కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో అరెస్టై జైలు పాలైన ఈమె.. కొద్ది రోజులుగా బెయిల్ కోసం పోరాడుతున్నారు. అయితే ఆమెకు బెయిల్ ఇచ్చినప్పటికీ కోర్టు ఒక మెలిక పెట్టింది. ఆమె తన పాస్‌పోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతే కాకుండా విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆదేశించింది.

ఇదే సమయంలో గుజరాత్ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం ఒక సూచన చేసింది. తీస్తా సెతల్వాద్‌ బెయిల్ విషయంలో కేవలం తాము ఆదేశించామని కాకుండా, ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగకుండా, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని కూడా గుజరాత్ హైకోర్టుకు తెలిపింది. ఈ విషయమై గురువారం విచారణ సమయంలో బెయిల్‭కు అవకాశం లేని పొటా, ఉపా వంటి కేసులు సెతల్వాద్‭పై లేవని సుప్రీం తెలిపింది. 2002 నాటి గుజరాత్‌ అల్లర్లలో తప్పుడు పత్రాలు సృష్టించి వాజ్యాలు వేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు పెట్టి ఆమెను ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు.

Madhya Pradesh: కేజీఎఫ్ హీరోలా ఫేమస్ అవ్వాలని వరుస హత్యలు.. ఐదుగురిని చంపిన కిరాతకుడు.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం