Madhya Pradesh: కేజీఎఫ్ హీరోలా ఫేమస్ అవ్వాలని వరుస హత్యలు.. ఐదుగురిని చంపిన కిరాతకుడు.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం

కేజీఎఫ్ సినిమాలో హీరోలాగా ఫేమస్ అవ్వాలనుకున్న ఒక యువకుడు ఐదుగురిని కిరాతకంగా హత్య చేశాడు. ఒంటరిగా ఉంటూ, రాత్రిపూట నిద్రపోయే సెక్యూరిటీ గార్డులను నిందితుడు హత్య చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.

Madhya Pradesh: కేజీఎఫ్ హీరోలా ఫేమస్ అవ్వాలని వరుస హత్యలు.. ఐదుగురిని చంపిన కిరాతకుడు.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం

Madhya Pradesh: లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’ స్ఫూర్తితో, ఫేమస్ అవ్వాలనే ఆశతో వరుస హత్యలకు పాల్పడ్డాడో యువకుడు. ఒంటరిగా ఉండే సెక్యూరిటీ గార్డులే టార్గెట్‌గా, ఐదుగురిని హత్య చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. మధ్యప్రదేశ్, భోపాల్‌లో శివ ప్రసాద్ అనే 19 ఏళ్ల యువకుడు కేజీఎఫ్ సినిమాలోని హీరోలాగా ఫేమస్ అవ్వాలనే ఆశతో హత్యలకు పాల్పడ్డాడు.

Bihar: మోకాలి లోతు వరద… డ్రమ్ములతో బోటు తయారు చేసి పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు

ఫేమస్ అవ్వాలనే ఏకైక ఆశతో ఐదుగురిని కిరాతకంగా చంపాడు. ఒంటరిగా ఉన్న సెక్యూరిటీ గార్డులు, వృద్ధులనే అతడు టార్గెట్ చేసేవాడు. రాత్రిపూట డ్యూటీలో నిద్రపోయే సెక్యూరిటీ గార్డుల్ని లక్ష్యంగా చేసుకుని, వారి తలపై పెద్ద రాయితో బాది చంపేవాడు. అలా మొత్తం ఐదుగురిని చంపాడు. దీనిపై విచారిస్తున్న పోలీసులకు ఈ కేసు ఒక సవాలుగా మారింది. అయితే, ఒకే వ్యక్తి సెక్యూరిటీ గార్డులను లక్ష్యంగా చేసుకుని హత్య చేస్తున్నట్లు అర్థమైంది. అది కూడా రాయితో. అలాగే ఎలాంటి దోపిడీలు జరగడం లేదు. కేవలం సాధారణ సెక్యూరిటీ గార్డులు మాత్రమే హత్యకు గురయ్యేవారు. దీంతో ఈ సీరియల్ కిల్లర్ కోసం గాలించారు. తాజాగా ఒక 23 ఏళ్ల సెక్యూరిటీ గార్డును అతడు హత్య చేశాడు.

Delhi airport: పైలట్ల సమ్మెతో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికుల అవస్థలు.. ఆదుకోండి అంటూ వినతి

దీనికి సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. హత్య చేసిన అనంతరం, తనను ఎవరూ చూడట్లేదని భావించి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ఆధారంగా అతడి కోసం పోలీసులు గాలించారు. కాగా, హత్యకు గురైన వారి దగ్గరి నుంచి కొట్టేసిన ఒక సెల్‌ఫోన్ నిందితుడు ఇంకా వాడుతున్నట్లు గుర్తించాడు. ఈ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతడ్ని అరెస్టు చేసి విచారించగా, ఫేమస్ అయ్యేందుకోసమే హత్యలు చేసినట్లు చెప్పాడు.