Bihar: మోకాలి లోతు వరద… డ్రమ్ములతో బోటు తయారు చేసి పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు

వరద నీటిలో చిక్కుకున్న ఒక గ్రామంలోని ప్రజలు... తమ ఊరికి చెందిన ఒక రోగిని ఆస్పత్రికి తరలించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. సొంతంగా బోటు తయారు చేసుకునిన, రోగిని పడుకోబెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Bihar: మోకాలి లోతు వరద… డ్రమ్ములతో బోటు తయారు చేసి పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు

Bihar: బిహార్‌లోని అనేక ప్రాంతాలను వరద ముంచెత్తింది. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి. దీంతో చాలా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. చుట్టూ నీరు నిలిచిపోయిన ఒక గ్రామ ప్రజలు, అత్యవసర పరిస్థితిలో రోగిని ఆస్పత్రికి తరలించేందుకు డ్రమ్ములతో బోటు తయారు చేశారు.

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6 నుంచి.. సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ తీర్మానం చేసే ఛాన్స్

కర్రలు, డ్రమ్ములు, ప్లాస్టిక్ వంటివి వాడి తాత్కాలికంగా ఒక బోటు తయారు చేశారు. ఇది తప్ప మరో అవకాశం లేదు ఆ గ్రామ ప్రజలకు. అలా తయారు చేసిన బోటుపై పేషెంట్‌ను పడుకోబెట్టి, మోకాలిలోతు నీటిలో నడుచుకుంటూ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రస్తుతం బిహార్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అనేక జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన పాటలు ఇవే..

లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం పదహారు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయ. రాష్ట్రంలో గంగా నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది. దీంతో ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసింది.