Assam: డిసెంబర్ 1లోపు అన్ని వివరాలు ఇవ్వాలి.. ప్రైవేటు మదర్సాలకు ప్రభుత్వం ఆదేశం

ఆరు నెలల్లో ప్రైవేటు మదర్సాలకు సంబంధించిన సర్వే పూర్తి చేయాలని, ఏ మదర్సాలో అయినా విద్యార్థులు లేకుంటే వాటిని మిగతా మదర్సాల్లో విలీనం చేయాలని ఏఐయూడీఎఫ్ జనరల్ సెక్రెటరీ కరీం ఉద్దీన్ బర్భూరియా అన్నారు. మదర్సాల్లో బయటి వ్యక్తుల్ని టీచర్లుగా నియమిస్తే పోలీసు దర్యాప్తు తప్పనిసరని, ముందుగా ప్రభుత్వ నిబంధనలు పాటించి అలాంటి నియామకాలు చేపట్టాలని ఆయన అన్నారు.

Assam: డిసెంబర్ 1లోపు అన్ని వివరాలు ఇవ్వాలి.. ప్రైవేటు మదర్సాలకు ప్రభుత్వం ఆదేశం

Private Madrasas in the state have been asked to provide all information

Assam: ఈ యేడాది డిసెంబర్ 1వ తేదీ లోపు టీచర్లు, విద్యార్థులు, స్థానికత సహా మిగిలన అన్ని వివరాలు తమకు ఇవ్వాలని అస్సాంలోని ప్రైవేటు మదర్సాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కొద్ది రోజులుగా మదర్సాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో కొన్ని అనుచిత కార్యకలాపాలకు మదర్సాలు కారణమవుతున్నాయన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. దీంతో హిమంత బిశ్వా శర్మ ప్రభుత్వం కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి బిశ్వా శర్మనే మదర్సాలపై అనేక సార్లు స్పందించారు.

నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కొన్ని మదర్సాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యాలాపాల ఆరోపణలతో కొన్ని మదర్సాలను ప్రభుత్వం ఇప్పటికే కూల్చి వేసింది. అంతే కాకుండా మదర్సాలను మూసేయాలనే డిమాండ్ సైతం కొంత మంది నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ప్రభుత్వ అండదండలు లేకుండా ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే సహకారంతో కొనసాగే మదర్సాల వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా గురువారం తమకు అన్ని వివరాలు కావాలంటూ ఆదేశాలు చేసింది.

ఆరు నెలల్లో ప్రైవేటు మదర్సాలకు సంబంధించిన సర్వే పూర్తి చేయాలని, ఏ మదర్సాలో అయినా విద్యార్థులు లేకుంటే వాటిని మిగతా మదర్సాల్లో విలీనం చేయాలని ఏఐయూడీఎఫ్ జనరల్ సెక్రెటరీ కరీం ఉద్దీన్ బర్భూరియా అన్నారు. మదర్సాల్లో బయటి వ్యక్తుల్ని టీచర్లుగా నియమిస్తే పోలీసు దర్యాప్తు తప్పనిసరని, ముందుగా ప్రభుత్వ నిబంధనలు పాటించి అలాంటి నియామకాలు చేపట్టాలని ఆయన అన్నారు.

Snake in 104 Vehicle Steering : 104 వాహనంలో స్టీరింగ్ పైకి వచ్చిన పాము .. భయంతో దూకేసిన డ్రైవర్