UP constable: ప్రశ్నించిన కానిస్టేబుల్‌కు వేధింపులు.. సెలవులపై పంపిన అధికారులు

మెస్‌లో ఆహారం బాగోలేదని ఆరోపించిన యూపీ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. అతడిని బలవంతంగా సెలవులపై పంపించారు. మెస్‌లో అందిస్తున్న ఆహారం బాగాలేదని ఒక కానిస్టేబుల్ ఏడుస్తూ చెప్పిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

UP constable: ప్రశ్నించిన కానిస్టేబుల్‌కు వేధింపులు.. సెలవులపై పంపిన అధికారులు

UP constable: పోలీస్ క్యాంటీన్‌లో అందిస్తున్న భోజనం బాగోలేదని ఇటీవల ఒక కానిస్టేబుల్ రోదిస్తూ చెప్పిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసింది. యూపీలోని ఫిరోజాబాద్ పోలీస్ లైన్స్ మెస్‌లో అందిస్తున్న భోజనం బాగోలేదని మనోజ్ కుమార్ అనే కానిస్టేబుల్ రోడ్డుపైకి వచ్చి ఏడ్చాడు.

Sachin Tendulkar: సచిన్ తొలి సెంచరీకి నేటితో 32 ఏళ్లు.. గుర్తు చేసిన బీసీసీఐ

ఆ భోజనాన్ని కుక్కలు కూడా తినవంటూ అతడు చెబుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే, నాణ్యత లేని భోజనం అందిస్తున్న మెస్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలీదు కానీ.. తన ఆవేదన వెళ్లగక్కిన పోలీసుపై మాత్రం అధికారులు చర్యలు తీసుకున్నారు. అతడిని అధికారులు సెలవులపై పంపినట్లు తెలుస్తోంది. అతడితో బలవంతంగా లాంగ్ లీవ్ పెట్టించారు. కానిస్టేబుల్ తీరుపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా క్రమశిక్షణారాహిత్యం కింద అతడిపై అనేకసార్లు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. డ్యూటీకి సరిగ్గా హాజరుకాకపోవడంతోపాటు అనేక కారణాలతో 15 సార్లు చర్యలు తీసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ఆరోపణలను మనోజ్ కుమార్ ఖండించారు.

JK Rowling: సల్మాన్ రష్దీ తర్వాత నువ్వే.. ‘హ్యారీపోటర్’ రచయిత్రికి హెచ్చరికలు

సీనియర్ అధికారులు తనను మానసిక రోగిగా చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. అలాగే తాను చేసిన పొరపాట్లకు సంబంధించి విచారణ జరుగుతోంది అంటూ వచ్చిన ఆరోపణల్ని కూడా మనోజ్ ఖండించాడు. తనపై ఎలాంటి విచారణ జరగడం లేదని చెప్పాడు. ఈ వీడియో వైరల్‌గా మారిన మరుసటి రోజు అధికారులు తనను తీసుకెళ్లి ఒక గదిలో బంధించారని ఆరోపించాడు. అయితే, భోజనానికి సంబంధించి తాను చేసిన ఆరోపణలపై విచారణ జరుగుతోందన్నాడు.