Sachin Tendulkar: సచిన్ తొలి సెంచరీకి నేటితో 32 ఏళ్లు.. గుర్తు చేసిన బీసీసీఐ

సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో తొలి సెంచరీ నమోదు చేసి నేటికి 32 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాల్ని బీసీసీఐ గుర్తు చేసింది. ఒక ఫొటోను కూడా విడుదల చేసింది.

Sachin Tendulkar: సచిన్ తొలి సెంచరీకి నేటితో 32 ఏళ్లు.. గుర్తు చేసిన బీసీసీఐ

Sachin Tendulkar: అంతర్జాతీయ క్రికెట్లో లెజెండరీ ఆటగాళ్లలో సచిన్ ఒకరు. తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎన్నో సంచలనాలు నమోదు చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టులు, వన్డేల్లో కలిపి వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచారు. వంద సెంచరీలు చేసిన సచిన్.. మొదటి సెంచరీ చేసింది మాత్రం ఈ రోజే (ఆగష్టు 14).

JK Rowling: సల్మాన్ రష్దీ తర్వాత నువ్వే.. ‘హ్యారీపోటర్’ రచయిత్రికి హెచ్చరికలు

1990, ఆగష్టు 14న సచిన్ అంతర్జాతీయ మ్యాచులో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. అప్పుడు అతడి వయసు 17 ఏళ్లే కావడం విశేషం. ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ సెంచరీ సాధించాడు. అతి చిన్న వయసులో సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 17 సంవత్సరాల 112 రోజులకే ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 189 బంతులు ఆడిన సచిన్.. 119 పరుగులు సాధించాడు. సచిన్ సెంచరీ సాధించడంతో భారత్ ఓటమి తప్పించుకుని, మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఈ సెంచరీ సాధించి నేటికి 32 ఏళ్లు అయిన సందర్భంగా ఈ జ్ఞాపకాల్ని బీసీసీఐ పంచుకుంది. సోషల్ మీడియా వేదికగా అప్పటి ఫొటోను విడుదల చేసింది. సెంచరీ సాధించి, చేతిలో బ్యాట్ పట్టుకుని వస్తున్న యంగ్ సచిన్‌ను ఫొటోలో చూడొచ్చు.

Rakesh Jhunjhunwala: వివాదాస్పదమైన మోదీ, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భేటీ.. కారణమేంటో తెలుసా!

సచిన్ తొలి సెంచరీ 1990లో సాధించినప్పటికీ, ఆయన తొలి టెస్టును 1989 నవంబర్‌లో పాకిస్తాన్‌తో ఆడాడు. ఇదే మ్యాచ్ ద్వారా పాక్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన వకార్ యూనిస్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో 15 పరుగులే చేసిన సచిన్, వకార్ యూనిస్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన చాలా కాలం తర్వాతే సెంచరీ నమోదు చేశాడు. అయితే, ఆ తర్వాత విజయవంతంగా దూసుకెళ్లారు. టెస్టులు, వన్డేల్లో అద్భుతమైన ప్రతిభ చూపాడు.