Harjot Bains: వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన మంత్రికి పాము కాటు

వుని అపారమైన దయ వల్ల, నా నియోజకవర్గం శ్రీ ఆనందపూర్ సాహిబ్‌లో వరద పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది. ఆగస్టు 15న నియోజకవర్గంలోని గ్రామాల్లో నీటి ఎద్దడి గురించి తెలియగానే నా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజలకు సేవ చేయడం మొదలుపెట్టాను

Harjot Bains: వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన మంత్రికి పాము కాటు

Updated On : August 19, 2023 / 5:53 PM IST

Punjab Floods: వరద ప్రభావిత ప్రాంతాల్ని సందర్శించేందుకు వెళ్లిన పంజాబ్‌లోని విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్‌ను పాము కాటు వేసింది. ప్రస్తుతం బెయిన్స్ ఆరోగ్యం బాగానే ఉందని స్వయంగా ఆయన తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పంజాబ్‌లో వరదలు సామాన్యులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే వరదల కారణంగా బాధపడుతున్న ప్రజల బాధను అర్థం చేసుకోవడానికి, భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తమ మంత్రులను, శాసనసభ్యులను వరద ప్రభావిత ప్రాంతాలకు పంపింది. ఈ సందర్భంలోనే బైన్స్‌ పాము కాటుకు గురయ్యారు.

Twitter-X: ట్విటర్ నుంచి డైరెక్ట్ మెసేజ్ తీసెయ్యరట.. కాకపోతే ఆ సేఫ్టీ ఫీచర్ మాత్రం పోతుందట

శనివారం, పంజాబ్ విద్యా మంత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌ చేశారు. అందులో ‘‘దేవుని అపారమైన దయ వల్ల, నా నియోజకవర్గం శ్రీ ఆనందపూర్ సాహిబ్‌లో వరద పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది. ఆగస్టు 15న నియోజకవర్గంలోని గ్రామాల్లో నీటి ఎద్దడి గురించి తెలియగానే నా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజలకు సేవ చేయడం మొదలుపెట్టాను. మూడు రోజుల క్రితం, సహాయక పనిలో గురు సాహిబ్ జీకి సేవ చేస్తున్నప్పుడు, ఒక విషపూరిత పాము నా కాలిని కాటు వేసింది. చికిత్స సమయంలో కూడా నేను నా ప్రజల సేవలోనే ఉన్నాను. భగవంతుని దయ, ఆశీస్సులు, ప్రార్థనలు, మీ అందరి ఆశీర్వాదాలకు ధన్యవాదాలు, నేను ఇప్పుడు పూర్తిగా బాగున్నాను. విషం వల్ల వచ్చే వాపు తగ్గుతుంది. అన్ని వైద్య పరీక్షలు ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చాయి. అందరి ప్రేమ, మద్దతు, ఆశీర్వాదం నాకు ఎప్పుడూ బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి’’ అని రాసుకొచ్చారు.

Asaduddin Owaisi: ఒకరు చౌకీదార్, ఇంకొకరు దుకాణ్‭దార్.. మోదీ, రాహుల్ మీద ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు

హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లోని కొండ ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా పంజాబ్ రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారింది. భాక్రా డ్యామ్, పాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల, రాష్ట్రంలోని రూప్‌నగర్, హోషియార్‌పూర్, కపుర్తలా, అమృత్‌సర్, తరన్ తరణ్, ఫిరోజ్‌పూర్, గురుదాస్‌పూర్ అనే 7 జిల్లాల్లోని 89 గ్రామాలు వరదలకు గురయ్యాయి.