ఇదే భారతీయత అంటే : ఆకలితో ఉన్న పాక్ ప్రజలకు ఫుడ్ ఇచ్చిన పంజాబ్ పోలీసులు

  • Published By: venkaiahnaidu ,Published On : March 4, 2019 / 06:38 AM IST
ఇదే భారతీయత అంటే : ఆకలితో ఉన్న పాక్ ప్రజలకు ఫుడ్ ఇచ్చిన పంజాబ్ పోలీసులు

క్షమించే గుణం ప్రపంచంలో ఒక్క భారతీయులకే సొంతం. కనికరించండని కన్నీళ్లు పెట్టుకుంటే తమపై దాడులు చేసినవాళ్లన్న విషయం కూడా పక్కనబెట్టి సాయం చేసే గుణం భారతీయులది. భారత్-పాక్ ల మధ్య  సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో కూడా అసలు సిసలైన భారతీయత అంటే ఇదేనని నిరూపించిన పంజాబ్  పోలీస్ అధికారులపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : పాక్ కు బుద్ధి చెప్పాల్సిందే : ఐరాస వద్ద నిరసల హోరు

భారత్-పాక్ ల మధ్య దాడులు,ప్రతిదాడులతో యుద్ధ వాతావరణం నెలకొనడంతో గురువారం(ఫిబ్రవరి-28,2019) భారత్-పాక్ దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను పాక్ అధికారులు రద్దు చేశారు.  దీంతో అమృత్ సర్ జిల్లాలోని అట్టారి రైల్వేస్టేషన్ దగ్గర 50మంది పాక్ ప్రజలు రైలు పున:ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు.ఎప్పుడు రైలు సర్వీస్ ప్రారంభమవుతుందా,ఎప్పుడు తమ దేశానికి వెళ్లిపోతామా అని ఎదురుచూస్తూ ఉన్నారు.

పాక్ మాత్రం తమ వాళ్ల గురించి పట్టించుకోలేదు. ఈ సమయంలో గంటల తరబడి నిద్రాహారాలుమాని రైలు కోసం ఎదురుచూస్తున్న పాకిస్తానీలకు శుక్రవారం(మార్చి-1,2019) పంజాబ్ పోలీసులు వారికి ఫుడ్,వాటర్ అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా ఆగిపోయిన పాక్ ప్రయాణికులు  అట్టారి-వాఘా జాయింట్ చెక్ పోస్ట్ ద్వారా అంతర్జాతీయ సరిహద్దు దాటేందుకు అన్ని ఏర్నాట్లు చేశారు.
Also Read : భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్‌ ఆర్మీ కాల్పులు

పంజాబ్ పోలీసుల తీరుపై ప్రంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమను ద్వేషించేవారిని కూడా ప్రేమించగలిగే గుణం ఒక్క భారతీయులకే ఉంటుందని, భారతీయులు ఇలాగే ఉంటారని సోషల్ మీడియా వేదికగా పంజాబ్ పోలీసులపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

	pnjab police.png