Covid-19 cases : కరోనా పంజా..స్కూల్స్, కాలేజీలు క్లోజ్!

వైరస్ ను కట్టడం చేసేందుకు పలు నియంత్రణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శనివారం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Covid-19 cases : కరోనా పంజా..స్కూల్స్, కాలేజీలు క్లోజ్!

Covid-19 cases

schools and colleges : భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా..కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతుండడంతో రాష్ట్రాల పాలకులు అలర్ట్ అయ్యారు. కఠిన నిబంధనలు, ఆంక్షలు అమలు చేస్తున్నారు. వైరస్ తగ్గుముఖం పట్టిన క్రమంలో..పలు రంగాలకు అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొన్నింటిని తాత్కాలికంగా మూసివేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది.

వైరస్ ను కట్టడం చేసేందుకు పలు నియంత్రణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శనివారం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31 వరకు మెడికల్, నర్సింగ్ కాలేజీలు మినహా..అన్ని విద్యా సంస్థలను తెరవవద్దని సూచించింది. అంతేగాకుండా..పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలు గుమి కూడవద్దని, మాల్స్ లో వంద మందికి మించి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇక సినిమా హాళ్లలో సగం సీట్లనే అనుమతించాలని వెల్లడించింది.

మహమ్మారి కారణంగా..పలు ప్రాంతాల్లో కర్ప్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభావం అధికంగా ఉన్న 11 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ మరో రెండు గంటలు పొడిగించాలని, జిల్లాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు, అంత్యక్రియు వంటి కార్యక్రమాలకు కేవలం 20 మందినే అనుమతినిస్తామని పేర్కొంది. ఆదివారం సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు, రెస్టారెంట్లు, మాల్స్ మూసివేయాలని తెలిపింది. రానున్న రెండు వారాల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసర పరిస్థితులు మినహా..బయటకు రావద్దని పంజాబ్ ప్రభుత్వం సూచిస్తోంది.