Uttarakhand : రాజ్ నాథ్ సింగ్ నోట పుష్ప డైలాగ్..

ప్రస్తుతం ఒక సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా పేరు పుష్ప. ఉత్తరాఖండ్‌లో కూడా ఒక పుష్కర్ ఉన్నారన్నారు రాజ్‌నాథ్‌. ఆయన చాలా సింపుల్‌గా, సౌమ్యంగా ఉంటారు...

Uttarakhand : రాజ్ నాథ్ సింగ్ నోట పుష్ప డైలాగ్..

Rajnath Singh

Pushkar Is A Flower : టాలీవుడ్ ఐకాన్ స్టార్ నటించిన ‘పుష్ఫ’ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ నటన విశ్వరూపంతో అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో బన్నీ డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ లో కూడా రిలీజ్ అయి..వంద కోట్లు కొల్లగొట్టింది. పుష్పలో తగ్గేదే లే అన్న డైలాగ్, శ్రీవల్లి పాటకు బన్నీ వేసిన స్టెప్స్ ను ఇతరులు అనుకరించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. క్రికెటర్ల నుంచి మొదలు కొని పలువరు సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల ఇతరులు ఫిదా అయ్యారు. శ్రీవల్లి పాటను యూపీ గొప్పదనాన్ని చాటిచెప్పేలా కాంగ్రెస్ పార్టీ మార్పులు చేసి ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా… కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నోటి వెంట పుష్ప డైలాగ్ రావడం విశేషం.

Read More : MTV Roadies : యాంకర్‌గా మారనున్న సోనూసూద్

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా పొలిటికల్‌గా కూడా అదరగొడుతోంది. ఆ సినిమాలోని డైలాగ్‌ ఇప్పుడు ఎన్నికల్లోనూ తూటాలు పేల్చుతోంది. స్వయంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ నోట పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా ఫైర్‌ అనే డైలాగ్‌ వినిపించింది. ఉత్తరాఖండ్ ‌ఎన్నికల ప్రచారంలో ఈ సినిమాను ప్రస్తావిస్తూ….. సీఎం పేరు కూడా పుష్కర్ సింగ్ అంటూ పోలిక తెచ్చారు. గంగోలిహట్‌ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ పుష్ప డైలాగ్ చెప్పారు.

Read More : Vijayawada : వివాహితపై అత్యాచారం.. వీడియో, ఫొటోలు తీసిన భార్య

ప్రస్తుతం ఒక సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా పేరు పుష్ప. ఉత్తరాఖండ్‌లో కూడా ఒక పుష్కర్ ఉన్నారన్నారు రాజ్‌నాథ్‌. ఆయన చాలా సింపుల్‌గా, సౌమ్యంగా ఉంటారు. ఆయనలో పేరు పుష్కర్‌ అయితే ఫ్లవర్ అనుకోవద్దని, నిప్పు అన్నారు. ఆయనను ఎవరూ ఆపలేరు, తగ్గేదే లేదు అంటూ చమత్కరించారు రాజ్‌నాథ్ సింగ్‌. ప్రచారాలు, అవగాహనలు కల్పించేందుకు ప్రభుత్వాలు కొత్త పుష్ప డైలాగ్‌లను వాడుతున్నాయి. కరోనా వైరస్‌పై తాజా సమాచారాన్ని అందించేందుకు ఇండియా ఫైట్ ఓమిక్రాన్ పేరుతో సమాచార మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఓ ట్విటర్‌ పేజీని తీసుకొచ్చింది. అల్లు అర్జున్‌ తగ్గేదేలే డైలాగ్ చెప్పే స్టిల్‌ను ఎడిట్‌ చేసి నటుడికి మాస్క్‌ పెట్టి ట్విట్ చేసింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ కొద్దిరోజుల క్రితం ఎన్నికల సాంగ్‌ను విడుదల చేసింది.