Rajasthan : తండ్రిని చంపినవాళ్లను 31 ఏళ్ల తర్వాత హతమార్చిన కొడుకులు..సినిమాను తలపించే ప్రతీకార హత్యలు

100 మంది యువతులపై అత్యాచారాలు చేసినవారిని బయటపెట్టిన జర్నలిస్టును హత్య చేసిన దుండుగులు. తండ్రిని చంపినవాళ్లను 31 ఏళ్ల తర్వాత హతమార్చిన కొడుకులు..సినిమాను తలపించే ఈ హత్యలు సంచలనం కలిగించాయి.

Rajasthan : తండ్రిని చంపినవాళ్లను 31 ఏళ్ల తర్వాత హతమార్చిన కొడుకులు..సినిమాను తలపించే ప్రతీకార హత్యలు

Sons revenge father murder after 31 years In Rajasthan

Sons revenge father murder after 31 years In Rajasthan :  సినిమాల్లో తండ్రిని, సోదరులను చంపినవాళ్లను పగబట్టి వెంటాడి వేటాడి మరీ చంపిన దృశ్యాలు చూస్తుంటాం. దీన్ని ఫ్యాక్షనిజం అన్నా మరో పేరు పెట్టుకున్నా అది సినిమాల్లోనే జరుగుతుంటాయి. కానీ రాజస్ధాన్ లో మాత్రం ఓ ప్రతీకార హత్య జరిగింది. తమ తండ్రిని చంపినవాళ్లను పగ బట్టి మరీ 31 ఏళ్ల తరువాత అంతమొందించిన కొడుకుల రియల్ స్టోరీ జరిగింది..!!

జర్నలిస్టుగా పనిచేసే ఓ వ్యక్తిని కొంతమంది 31 ఏళ్ల క్రితం కొంతమంది హత్య చేశారు. హత్య గావించబడిన వ్యక్తికి ఇద్దరు కొడుకులున్నారు. జర్నలిస్టు హత్య జరిగేనాటికి అతని ఇద్దరు కొడుకులు చిన్నవాళ్లు. పెద్ద కొడుకుకు 12 ఏళ్లు, చిన్నకొడుకుకు 8 ఏళ్లు వయస్సు. కానీ వారి తండ్రి హత్యకు గురి కావటం ఆ చిన్నారి మనస్సులో ముద్రించుకుపోయింది. బహుశా సినిమాల్లో వలెనే మా తండ్రిని హత్య చేసినవారిపై ఎప్పటికైనా ప్రతీకారం తీర్చుకుంటామని వారు ప్రతిజ్ఞ చేసుకున్నారేమో మనస్సులో..అలా తమ తండ్రిని హత్య చేసినవారిని 31 ఏళ్ల తరువాత (వాళ్లు పెద్దవాళ్లు అయ్యాక) అంతమొందించి ప్రతీకారం తీర్చుకున్న ఘటన రాజస్థాన్ లో అజ్మీర్ లో జరిగింది.

1992 లో రాజస్థాన్ లో అజ్మీర్ లో స్కూలు, కాలేజీ విద్యార్థినులను అసభ్యంగా ఫోటోలు తీసి ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి..వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు జరిగాయి. అప్పట్లో మదన్ సింగ్ అనే జర్నలిస్టు ఓ వారపత్రిక నడిపేవారు. అజ్మీర్ అరాచకాలపై మదన్ సింగ్ తన పత్రికలో కథనాలు రాశారు. కొంతమంది దాదాపు 100 మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశారని ఆర్టిక్స్ లో పేర్లతో సహా వివరంగా రాశారు. అలా తన జర్నలిజం వృత్తికి న్యాయం చేస్తూ ఎన్నో వాస్తవాలను బయటపెట్టారు. ఓ బ్లాక్ మెయిల్ కుంభకోణం గురించి కూడా రాశారు.

దాంతో కొందరు వ్యక్తులు మదన్ సింగ్ పై కక్ష కట్టారు. అతన్ని హత్య చేయాలనుకున్నారు. అలా మదన్ సింగ్ పై మొదటిసారి శ్రీనగర్ రోడ్ లో దాడి చేశారు. ఈ మారణాయుధాలతో దాడిలో గాయాలతో తప్పించుకున్నారు. జేఎల్ఎన్ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటుండగా సదరు దుండగులు అతను బతికి ఉంటే మరోసారి తమ బండారం బయటపెడతాడని జేఎల్ఎన్ ఆసుపత్రికి వచ్చి మరోసారి ఆయనపై దాడి చేశారు. రెండోసారి జరిగితన దాడి చేయడంతో తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయారు.

ఈ హత్యపై సమాచార అందుకున్న పోలీసులు సవాయ్ సింగ్, రాజ్ కుమార్ జైపాల్, నరేంద్ర సింగ్ తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ హత్య జరిగిన సమయంలో మదన్ సింగ్ ఇద్దరు కొడుకులు మదన్ సింగ్, సూర్య ప్రతాప్ సింగ్ చిన్నవాళ్లు. మదన్ కు 12 ఏళ్లు, సూర్య వయసు 8 ఏళ్లు. అప్పట్లో ఈ కేసులో యూత్ కాంగ్రెస్ నేతల పేర్లు వినపడడంతో అంతర్జాతీయ స్థాయిలో సంచలనం కలిగించింది. మదన్, సూర్య ప్రతాప్ సింగ్ పెరిగి పెద్దవాళ్లయ్యారు.

2012లో ఈ కేసులో నిందితులైన సవాయ్ సింగ్, రాజ్ కుమార్ జైపాల్ లను కోర్టు నిర్దోషులుగా పేర్కొంది. ఇక మదన్, సూర్యల పగ వారి వయసుతో పాటే పెరుగుతూ వచ్చింది. అదను చూసి సవాయ్ సింగ్ ను అంతమొందించారు. తన కుమారుడి పెళ్లి ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు పుష్కర్ లోని ఓ రిసార్ట్ కు వచ్చిన 70 ఏళ్ల మాజీ కౌన్సిలర్ సవాయ్ సింగ్ పై సూర్య, మదన్ లు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో సవాయ్ సింగ్, దినేశ్ తివారీ అనే మరో వ్యక్తి ప్రాణాలు విడిచారు. అయితే ఈ ఘటనలో సూర్యను పోలీసులు అరెస్ట్ చేయగా, మదన్ తప్పించుకున్నాడు. సూర్య నుంచి పోలీసులు ఓ పిస్టల్, మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ అన్నదమ్ములిద్దరు వారి తండ్రిని హత్య చేసినవారిని చంపటానికి గతంలో కూడా ఓ సారి యత్నించి విఫలమయ్యారు. ఈరెండవ ప్రయత్నంలో మాత్రం సఫలమయ్యారు.