Bharat Jodo Yatra: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రాహుల్ గాంధీ డుమ్మా

యాత్రలో అనేక పార్టీలు, నేతలు రాహుల్ గాంధీని కలుసుకుని భారత్ జోడో యాత్రకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన కీలక నేత ఆదిత్య థాకరే శుక్రవారం ఈ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో ఆదిత్య థాకరే మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర రాజకీయాల కంటే ఎక్కువని, ఇది దేశం యొక్క ఆలోచనని అన్నారు.

Bharat Jodo Yatra: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రాహుల్ గాంధీ డుమ్మా

Rahul Gandhi likely to skip Parliament winter session

Bharat Jodo Yatra: తొందరలో జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ హాజరుకాకపోవచ్చని కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించింది. భారత్ జోడో యాత్రలో రాహుల్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న కారణంగా పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉంటారని పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. 150 రోజుల పాటు సాగనుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మొత్తం 3,570 యాత్ర సాగుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతున్న ఈ యాత్రకు నేటితో 66వ రోజు.

ఈ యాత్రలో అనేక పార్టీలు, నేతలు రాహుల్ గాంధీని కలుసుకుని భారత్ జోడో యాత్రకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన కీలక నేత ఆదిత్య థాకరే శుక్రవారం ఈ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో ఆదిత్య థాకరే మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర రాజకీయాల కంటే ఎక్కువని, ఇది దేశం యొక్క ఆలోచనని అన్నారు. ‘‘ఇది (భారత్ జోడో యాత్ర) ప్రజాస్వామ్యం కోసం, దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఆలోచన కోసం సాగుతున్న యాత్ర. భారత ప్రజాస్వామ్యానికి ఈ యాత్ర అద్దం పడుతోంది’’ అని ఆదిత్య థాకరే అన్నారు.

వాస్తవానికి ఈ యాత్రలో సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్ పాల్గొనాల్సి ఉంది. అయితే ఆకస్మిక అనారోగ్యం కారణంగా.. పవార్ ఆసుపత్రిలో చేరారని, అందుకే హాజరు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ గురువారం స్పష్టం చేశారు. ఈ యాత్రకు ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, సుప్రియా సూలే, జితేంద్ర అహ్వాద్ శుక్రవారం హాజరు కానున్నట్లు కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ తెలిపారు.

Gujarat Polls: నరేంద్ర మోదీ పేరు మారుస్తాం.. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్