Gujarat Polls: నరేంద్ర మోదీ పేరు మారుస్తాం.. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్

రాష్ట్రంలోని వృద్ధులకు వితంతువులకు 2,000 రూపాయల పించన్ ఇస్తామని చెప్పారు. వీటితో పాటు రాష్ట్రంలో 3,000 ఇంగ్లీషు మీడియం పాఠశాలలు ఏర్పాటు చేయడం, వీటితో పాటు రాష్ట్రంలోని బాలికలందరికీ పోస్ట్ గ్రాడ్యూయేషన్ వరకు ఉచిత విద్య అందించడం, రైతులకు 3 లక్షల రూపాయల వరకు రుణమాఫి, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ కేవలం 500 రూపాయలకే అందించడం వంటి హామీలు ఇచ్చారు.

Gujarat Polls: నరేంద్ర మోదీ పేరు మారుస్తాం.. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్

Congress Promises To Rename Narendra Modi Stadium in Gujarat Manifesto

Gujarat Polls: అహ్మాదాబాద్‭లోని మొతేరా క్రికెట్ స్టేడియం పేరును నరేంద్రమోదీ స్టేడియంగా కొద్ది రోజుల క్రితం మార్చారు. కాగా, ఇప్పుడా స్టేడియం పేరును మారుస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. గుజరాత్ అసెంబ్లీలో తాము గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఆ స్టేడియంకు ఉన్న నరేంద్రమోదీ పేరును తొలగిస్తామని ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం గమనార్హం. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శనివారం రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇందులో గుజరాతీలపై పలు వరాల జల్లు కురిపించారు.

గుజరాత్‭లోని యువతకు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తారట. ఇక నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల చొప్పున భృతి కల్పిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని వృద్ధులకు వితంతువులకు 2,000 రూపాయల పించన్ ఇస్తామని చెప్పారు. వీటితో పాటు రాష్ట్రంలో 3,000 ఇంగ్లీషు మీడియం పాఠశాలలు ఏర్పాటు చేయడం, వీటితో పాటు రాష్ట్రంలోని బాలికలందరికీ పోస్ట్ గ్రాడ్యూయేషన్ వరకు ఉచిత విద్య అందించడం, రైతులకు 3 లక్షల రూపాయల వరకు రుణమాఫి, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ కేవలం 500 రూపాయలకే అందించడం వంటి హామీలు ఇచ్చారు.

మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం గెహ్లాట్ మాట్లాడుతూ గడిచిన 27 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ ప్రారంభిస్తామని, అవినీతి డబ్బును బయటికి తీస్తామని అన్నారు. 10 లక్షల రూపాయల వరకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని, అలాగే 5 లక్షల రూపాయల వరకు మందుల సదుపాయం కల్పిస్తామని గెహ్లాట్ అన్నారు.

International Cricket Council: ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్క్లే.. ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ చీఫ్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా