Rahul Gandhi: కిటికీలు, తలుపులు చేసే పనుల్లో మమేకమైన రాహుల్ గాంధీ

కాంగ్రెస్‌కు పునర్వైభవం కోసం రాహుల్ గాంధీ దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి పనుల్లో పాలుపంచుకుంటున్నారు.

Rahul Gandhi: కిటికీలు, తలుపులు చేసే పనుల్లో మమేకమైన రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల్లో మమేకమై కూలీ పనుల్లోనూ పాలుపంచుకుంటున్నారు. ఇటీవలే ఆయన రైల్వే స్టేషన్‌లో హమాలీగా కనపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలోని ఫర్నీచర్‌ మార్కెట్‌ కృతి నగర్‌ లో ఆయన కార్పెంటర్ పనిచేశారు. కాసేపు కిటికీలు, తలుపులు చేసే పనుల్లో మమేకం అయ్యారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ట్విటర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. కార్పెంటర్లు కష్టపడి పనిచేసే వారు మాత్రమే కాదని గొప్ప కళాకారులు కూడా అని రాహుల్ గాంధీ చెప్పారు. తాను వారి నుంచి స్కిల్స్ నేర్చుకున్నానని తెలిపారు. రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

కాగా, మరికొన్ని నెలల్లో దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు మరింత దగ్గర కావాలని ప్రణాళికలు వేసుకున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదటి విడత పూర్తయింది. ఆ యాత్రతో రాహుల్ కాంగ్రెస్ పార్టీ వైపునకు దేశం దృష్టి తిరిగేలా చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

 Caveat Petition : చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్, ఎందుకీ పిటిషన్?