BJP leader: బీజేపీ నేత పొరబాటున వస్తే.. బట్టలు చింపిన రైతు ఉద్యమకారులు

ఢిల్లీ సరిహద్దుల్లో మొదలైన ఉద్యమం ఎనిమిది నెలలకు పైగా కొనసాగుతూనే ఉంది. కొద్ది పాటి అల్లర్లు జరుగుతూనే వాదాన్ని వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో బీజేపీ నేతను ఘోరంగా అవమానించారు.

BJP leader:  బీజేపీ నేత పొరబాటున వస్తే.. బట్టలు చింపిన రైతు ఉద్యమకారులు

BJP leader: ఢిల్లీ సరిహద్దుల్లో మొదలైన ఉద్యమం ఎనిమిది నెలలకు పైగా కొనసాగుతూనే ఉంది. కొద్ది పాటి అల్లర్లు జరుగుతూనే వాదాన్ని వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో బీజేపీ నేతను ఘోరంగా అవమానించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తుండగా.. బీజేపీ తలపెట్టిన మరో ఆందోళనలో పాల్గొనేందుకు మేఘ్వాల్ అక్కడికొచ్చారు.

రైతులు, శ్రామికులు, వ్యాపారులు, యునైటెడ్ కిశాన్ మోర్చా సంయుక్తంగా అతణ్ని వ్యతిరేకించాయి.

రాజస్థాన్ లో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు.. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి మేఘ్వాల్ రెడీ అయ్యారు. సెంట్రల్ జైల్ సమీపంలో బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది. అదే సమయంలో మహరాజా గంగా సింగ్ చౌక్ వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. బీజేపీ చేపట్టిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు హనుమాన్‌ఘర్ బీజేపీ వర్కర్లు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రెసిడెంట్ కైలాశ్ మేఘ్వాల్ వస్తున్నారు.

దారి తప్పిన ఆయన రైతు ఉద్యమానికి వచ్చేశారు. అది రైతులకు మాత్రమే తెలిసింది. మేఘ్వాల్ మెడకు ఉన్న బీజేపీ జెండాను చూసిన వాళ్లు.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు. అక్కడ కాసేపు వాదన జరిగింది. అందులోనే అతని బట్టలు కూడా చింపేశారు. మరికొందరు రైతులు కలగజేసుకుని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.