అత్యాచార బాధితురాలికే శిక్ష

బిహార్‌లో దారుణం జరిగింది. గయలో ఓ యువతిపై అత్యాచారం చేశారు. గ్రామ పంచాయతీ బాధితురాలిని దోషిగా తేల్చి శిక్ష విధించింది.

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 12:17 PM IST
అత్యాచార బాధితురాలికే శిక్ష

బిహార్‌లో దారుణం జరిగింది. గయలో ఓ యువతిపై అత్యాచారం చేశారు. గ్రామ పంచాయతీ బాధితురాలిని దోషిగా తేల్చి శిక్ష విధించింది.

బిహార్‌లో దారుణం జరిగింది. గయలో ఓ యువతిపై అత్యాచారం చేశారు. గ్రామ పంచాయతీ బాధితురాలిని దోషిగా తేల్చి శిక్ష విధించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కథనం ప్రకారం 2019, ఆగస్టు 14వ తేదీ సాయంత్రం ఓ యువతిని కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి వాహనంలో తీసుకువెళ్లారు. స్థానిక పంచాయతీ భవనంపైకి తీసుకెళ్లి ఆమె స్పృహ కోల్పోయేంత వరకు అనేకసార్లు అత్యాచారం చేశారు. మరుసటి రోజు ఓ గ్రామస్తుడు చూసి యువతి తల్లిదండ్రులకు తెలపడంతో వారు వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. 

అయితే నిందితుల కుటుంబీకులు, బంధువులకు గ్రామంలో పేరు, పలుకుబడి ఉండడంతో బాధితురాలికి న్యాయం చేయాల్సిన పంచాయతీ తిరిగి సదరు యువతినే దోషిగా తేల్చి శిక్ష విధించింది. గుండు చేయించి గ్రామంలో ఊరేగించారు. బాధిత కుటుంబం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. 

ఈ సంఘటన జరిగిన 11 రోజుల తర్వాత పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే బాధిత కుటుంబం జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలిసి వేడుకున్న తర్వాతనే కేసు నమోదు చేయడం గమనార్హం. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

గ్రామ సభ నిర్వహించి యువతికి శిక్ష ఖరారు చేసిన ఐదురుగు పంచాయతీ పెద్దలపై సైతం పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న బిహార్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గయా సీనియర్ ఎస్పీకు లేఖ రాశారు. 2019, సెప్టెంబర్ 2వ తేదీన పంచాయతీ సభ్యులను తమ ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు.