Bank Locker Rules: బ్యాంకుల్లో లాకర్ల రూల్స్‌పై ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

మీరు బ్యాంకులో సేఫ్ డిపాజిట్ లాకర్ పొందాలనుకుంటున్నారా? రెంటల్ ఛార్జీ పెరిగింది. అంతేకాదు.. నిబంధనలు కూడా కఠినంగా మారాయి.

Bank Locker Rules: బ్యాంకుల్లో లాకర్ల రూల్స్‌పై ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

Rbi Revises Guidelines For Hiring Of Bank Lockers

RBI revises guidelines on Bank Lockers : మీరు బ్యాంకులో సేఫ్ డిపాజిట్ లాకర్ పొందాలనుకుంటున్నారా? రెంటల్ ఛార్జీ పెరిగింది. అంతేకాదు.. నిబంధనలు కూడా కఠినంగా మారాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులలో లాకర్లపై కొత్త రూల్స్‌పై గైడ్ లైన్స్ జారీ చేసింది. బ్యాంకు లాకర్ సర్వీసుల నిబంధనలను ఆర్బీఐ సవరించింది. అగ్నిప్రమాదం, భవనం కుప్పకూలడం, బ్యాంకు సిబ్బంది మోసం, చోరీ వంటి కారణాలతో లాకర్లలో దాచిన వాటికి నష్టం వాటిల్లిన సందర్భాల్లో వార్షిక లాకర్ అద్దెకు గరిష్టంగా 100 రెట్లు వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ సూచించింది. చట్ట విరుద్ధమైనవి బ్యాంకు లాకర్లలో ఉంచడానికి వీల్లేదని తెలిపింది. ప్రకృతి విపత్తుల నష్టానికి మాత్రం బ్యాంకులు బాధ్యత ఉండదని తెలిపింది.

ఈ విషయంలో బ్యాంకుల బాధ్యతను ఆర్బీఐ పరిమితం చేసింది. ఈ మేరకు సవరించిన నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు RBI ప్రకటించింది. ఈ కొత్త బ్యాంకు లాకర్ రూల్స్‌ను బ్యాంకులు సవరించుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులు అందిస్తున్న డిపాజిట్‌ లాకర్‌/సేఫ్‌ కస్టడీ ఆర్టికల్‌ సర్వీసులను ఆర్బీఐ సమీక్షించింది. పలు సూచనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం లాకర్ నిబంధనల్లో సవరణలు చేసినట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రస్తుత, నూతన కస్టమర్లకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని తెలిపింది. ఇకపై బ్యాంకు లాకర్లు ఎన్ని ఖాళీగా ఉన్నాయో లిస్టుతో పాటు ప్రతి అప్లికేషన్ వెయిట్ లిస్టు జాబితాను నిర్వహించాల్సి ఉంటుందని సూచించింది.

ప్రకృతి విపత్తుల్లో లాకర్లపై బాధ్యత ఉండదు :
లాకర్లు/సేఫ్‌ డిపాజిట్‌ వాల్ట్‌ల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. అలాగే విపత్తుల నుంచి భవనాలకు రక్షణ కల్పించుకోవాలని ఆర్‌బీఐ తెలిపింది. లాకర్‌లో దాచిన వాటి విషయంలో ఎలాంటి బాధ్యత లేదని బ్యాంకులు చెప్పడానికి వీల్లేదని పేర్కొంది. చోరీ, దోపిడీ, అగ్నిప్రమాదం, మోసం వంటి కారణాల వల్ల కస్టమర్‌కు నష్టం వాటిల్లితే మాత్రం వార్షిక లాకర్‌ అద్దెకు 100 రెట్ల వరకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉంటుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇకపై లాకర్‌ ఒప్పందం ప్రారంభంలోనే మూడేళ్ల అద్దెకు సరిపడా డిపాజిట్‌ను బ్యాంకులు తీసుకునే వీలుంది. మంచి పేమెంట్ హిస్టరీ కలిగిన అకౌంట్ దారుల నుంచి డిపాజిట్ల కోసం ఒత్తిడి చేయరాదని కూడా ఆర్‌బీఐ తెలిపింది. వరుసగా మూడేళ్ల పాటు లాకర్‌ అద్దె చెల్లించని యెడల ఆయా లాకర్లను తెరిచే అధికారం బ్యాంకులకు కల్పించింది.
RBI Interest Rates : వడ్డీ రేట్లు.. ఎలాంటి మార్పులు చేయని ఆర్బీఐ

ఏదేమైనా, బ్యాంకు అకౌంట్ దారులకు ఉపశమనం కలిగించే చర్యలో భాగంగా ఆర్బీఐ బ్యాంకులకు మరణించిన లాకర్, అద్దెదారుల క్లెయిమ్‌లను పరిష్కరించడం, లాకర్‌లోని వాటిని విడుదల చేయడం తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి ఒక పాలసీని కూడా రూపొందించాలని బ్యాంకులను కోరింది. క్లెయిమ్ అందిన తేదీ నుంచి 15 రోజులకు మించకూడదు. సురక్షిత డిపాజిట్ లాకర్‌లో చట్టవిరుద్ధమైన లేదా ఏదైనా ప్రమాదకరమైన వాటిని ఉంచరాదనే నిబంధనను బ్యాంకులు లాకర్ ఒప్పందంలో చేర్చాలని ఆర్‌బిఐ పేర్కొంది. సేఫ్ డిపాజిట్ లాకర్‌లో కస్టమర్ ఏదైనా చట్టవిరుద్ధమైన లేదా ప్రమాదకరమైన వాటిని డిపాజిట్ చేసినట్లు బ్యాంక్ అనుమానించినట్లయితే సదరు కస్టమర్ పై తగిన చర్యలు తీసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుందని పేర్కొంది.

సురక్షిత డిపాజిట్ లాకర్ల కోసం బ్యాంకులు బోర్డు ఆమోదించిన ఒప్పందాన్ని కలిగి ఉండాలని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. ఈ ప్రయోజనం పొందేందుకు IBA ద్వారా రూపొందించిన మోడల్ లాకర్ ఒప్పందాన్ని బ్యాంకులు స్వీకరించవచ్చు. ఈ ఒప్పందంలో సవరించిన సూచనలు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉంటుంది. జనవరి 1, 2023 నాటికి బ్యాంకులు తమ లాకర్ ఒప్పందాలను ఇప్పటికే ఉన్న లాకర్ కస్టమర్లతో పునరుద్ధరించాలని RBI తెలిపింది.
Mastercard ban: మాస్టర్ కార్డ్ సేవలు పునరుద్ధరించాలని ఆర్బీఐ సూచన