MSVG: హుక్ స్టెప్ లో వీణ స్టెప్పు బాస్ ఐడియానే.. అది కూడా సింగిల్ టేక్ లోనే.. మొత్తానికి రఫ్ఫాడించారుగా!
మన శంకర వరప్రసాద్ గారు(MSVG) సినిమా సంక్రాంతి స్పెషల్ ఇంటర్వ్యూలో హుక్ స్టెప్ సాంగ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన అనిల్ రావిపూడి.
mana shankara vara prasad garu sankranthi special interview (1)
- హుక్ స్టెప్ లో వీణ స్టెప్పు యాడ్ చేసింది మెగాస్టార్
- మేమంతా తలలు పట్టుకుంటే ఆయన సింగల్ టేక్ లో చేసేశాడు
- హుక్ స్టెప్ సాంగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన అనిల్ రావిపూడి
MSVG: మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా హిట్ అందుకోవడమే కాదు భారీ కలెక్షన్స్ ను కూడా రాబడుతోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను చూసేందుకు ఫ్యామిలీస్ ఎగబడుతున్నారు. దీంతో, మొదటిరోజు ఏకంగా రూ.82 కోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరితంగా పెరిగే అవకాశం ఉందని మేకర్స్ చెప్తున్నారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ఎంత చెప్పినా తక్కువే. రొటీన్ స్టోరీనే అయినా ఫ్యామిలీ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైనర్ చేశాడు. అయితే, మన శంకర వరప్రసాద్ గారు(MSVG) సినిమా భారీ విజయం సాధించిన నేపధ్యంలో స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు మూవీ టీం. ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, సినిమాలో స్పెషల్ రోల్ చేసిన వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొన్నారు.
Malavika Mohanan: చేతిలో పువ్వుతో వికసించే నవ్వుతో.. మాళవిక లేటెస్ట్ ఫొటోలు
ఈ సందర్బంగా సోషల్ మీడియాను షేక్ చేసిన హుక్ స్టెప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు అనిల్ రావిపూడి. నిజానికి, ఈ పాటను కంపోజ్ చేసింది. ఆట సందీప్ మాస్టర్. చాలా ట్రెండో బీట్ తో ఉన్న ఆ సాంగ్ కి అంతకన్నా ట్రెండీగా ఉన్న స్టెప్స్ ని కంపోజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేశాడు సందీప్ మాస్టర్. అయితే, చేతిలో మొబైల్ పట్టుకొని చేసే స్టెప్ కన్నా ముందు ‘హుక్ స్టెప్పు.. హుక్ స్టెప్పు’ అంటూ ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ కి ఏ స్టెప్ ఉంటే బాగుంటుంది అని అనిల్, సందీప్ చాలా ఆలోచించారట. కానీ ఏది సెట్ కాలేదట.
అదంతా దూరం నుంచి చూస్తున్న చిరు తన పాత సినిమాలోని హుక్ స్టెప్స్ అన్ని అక్కడ పెడితే బాగుటుందని భావించాడట. అది అనిల్ కి, సందీప్ కి చెప్పడకుండా జస్ట్ అక్కడ ఉన్న డాన్సర్స్ కి చెప్పి డైరెక్ట్ టేక్ చేద్దాం అని చెప్పాడట. అలా సింగల్ టేక్ లో ఆ స్టెప్ షూట్ ఒకే అయిందట. దీంతో, అక్కడున్న టీం అందరు ఒక్కసారిగా అవాక్కయ్యారట. అలా హుక్ స్టెప్పు వైరల్ అవడానికి మెగాస్టార్ సెట్ చేసిన బీట్ కూడా ఒక కారణం అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
