USA U-19 World Cup Squad: అరెరె.. ఇది అమెరికా క్రికెట్ జట్టా లేక భారత క్రికెట్ జట్టా.. అంతా ఇండియన్స్‌లానే ఉన్నారే.. తెలుగు వాళ్లు కూడా..
అమెరికా ప్రకటించిన జట్టులో దాదాపుగా భారత సంతతికి చెందిన ఆటగాళ్లే ఉన్నారు. జట్టులో తెలుగోళ్లు ముగ్గురు ఉండడం మరో హైలైట్.
USA U-19 World Cup Squad Representative Image (Image Credit To Original Source)
- అమెరికా క్రికెట్ జట్టులో భారతీయులు
- ముగ్గురు తెలుగు వాళ్లు కూడా
- క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నారు
USA U-19 World Cup Squad: ఐసీసీ మెన్స్ అండర్ -19 వరల్డ్ కప్ కోసం అమెరికా ప్రకటించిన జట్టులోని ప్లేయర్లను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. మరీ ముఖ్యంగా ఇండియన్స్. ఇది అమెరికా క్రికెట్ జట్టా? లేక భారత క్రికెట్ జట్టా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. అమెరికా క్రికెట్ టీమ్ లో ఉన్న ప్లేయర్లు.. అచ్చం ఇండియన్స్ లానే ఉన్నారు మరి. అంతేకాదు ఈ జట్టులో తెలుగోళ్లు ముగ్గురు ఉండడం మరో హైలైట్.
అమెరికా ప్రకటించిన జట్టులో దాదాపుగా భారత సంతతికి చెందిన ఆటగాళ్లే ఉన్నారు. ఉత్కర్ష్ శ్రీవాస్తవ కెప్టెన్. జట్టులోని మిగిలిన 14 మంది సభ్యులు కూడా భారత్ మూలాలను కలిగున్నారు. అమెరికాలో భారత సంతతి వారి సంఖ్య బాగా ఎక్కువ. ఎన్నో ఏళ్ల క్రితం ఇండియా నుంచి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డ వారు ఎందరో. ఇక వీరిలో చాలా మంది క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవడం విశేషం.
గ్రూప్ Bలో ఇండియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో పాటు USA కూడా ఉంది. ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు. ఐదుసార్లు టైటిల్ గెలుచుకుంది. నాలుగు సార్లు రన్నరప్‌గా నిలిచింది. గత అండర్-19 ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఫైనల్‌లో భారత్‌ను ఓడించింది. ప్రస్తుత టోర్నమెంట్ జనవరి 15 నుండి ఫిబ్రవరి 6 వరకు నమీబియా, జింబాబ్వేలో జరుగుతుంది. ఫైనల్ హరారేలో జరగనుంది.
ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన చివరి జట్టు USA. జార్జియాలోని రైడల్‌లో జరిగిన డబుల్ రౌండ్-రాబిన్ క్వాలిఫైయర్‌లో కెనడా, బెర్ముడా, అర్జెంటీనాను ఓడించారు. క్వాలిఫయర్స్ రెండో దశలో బెర్ముడా, అర్జెంటీనాపై విజయాలతో 10 పాయింట్లు సాధించింది యూఎస్ఏ. టాప్ ఆర్డర్ బ్యాటర్ అమరీందర్ గిల్ మూడు ఇన్నింగ్స్‌లలో 199 పరుగులతో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. స్పిన్ బౌలర్లు అన్ష్ రాయ్, సాహిర్ భాటియా చెరో 7 వికెట్లు పడగొట్టారు.
యూఎస్ఏ అండర్ 19 జట్టు ఇదే..
ఉత్కర్ష్ శ్రీవాస్తవ(కెప్టెన్)
అద్వైత్ క్రిష్ణ
అమరీందర్ గిల్
రిత్విక్ అప్పిడి
అమోఘ్ ఆరేపల్లి
అద్మిత్ జాంబ్
అదిత్ కప్పా
అర్జున్ మహేశ్
రాయన్ తాజ్
శబరీష్ ప్రసాద్
సాహిల్ గార్గ్
సాహిర్ భాటియా
రిషబ్ షింపి
శివ్ శానీ
నితీశ్ సూదిని
USA PLAYING 11 vs INDIA IN U19 WORLD CUP 😄 pic.twitter.com/d0aYmSlaZ1
— Johns. (@CricCrazyJohns) January 15, 2026
