Madhya Pradesh: మహిళల సమ్మతి వయస్సును 18 నుంచి 16కి తగ్గించాలి.. కేంద్రాన్ని కోరిన హైకోర్టు
చాలా క్రిమినల్ కేసుల్లో యుక్త వయస్సులో ఉన్న అబ్బాయిలకు అన్యాయం జరుగుతోందని మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ వ్యాఖ్యానించింది.

High Court
Madhya Pradesh: యుక్తవయస్సులోని బాలురకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించడానికి అత్యాచారం కేసులలో సమ్మతి వయస్సును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించే విషయాన్ని పరిశీలించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2020 జూలై 17న నమోదైన అత్యాచారం కేసుకు సంబంధించి దాఖలైన పిటీషన్‌ను విచారిస్తున్న సందర్భంగా జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
TSPSC Group-4 Exam: గ్రూప్ -4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
ప్రస్తుతం కాలంలో.. ఇంటర్నెట్ కనెక్టివిటీ అందరికీ అందుబాటులోకి రావడం వల్ల సోషల్ మీడియాపై చిన్నవయస్సులోనే అందరికీ అవగాహన పెరుగుతోంది. ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగం వల్ల చిన్నవయస్సులోనే అన్ని విషయాలపై బాలురు, బాలికలు పూర్తిగా అవగాహన కలిగి ఉంటున్నారు. అంతేకాక, మగ, ఆడ వారిలో యుక్తవయస్సు 14ఏళ్లలోపు వస్తుంది. దీని ఫలితంగా సమ్మతితో బాలురు, బాలికల మధ్య శారీరక సంబంధాలు ఏర్పడతాయని జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్ ధర్మాసనం అభిప్రాయ పడింది. క్రిమినల్ లా (సవరణ) చట్టం 2013 ప్రకారం.. ఒక అమ్మాయి లైంగిక సంపర్కానికి అంగీకరించే వయస్సును 18ఏళ్లకు పెంచడం వల్ల యుక్త వయస్సులో ఉన్న అబ్బాయిలకు అన్యాయం జరుగుతోందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
SriLanka New Marriage act : స్థానికులను పెళ్లి చేసుకోవాలంటే..రక్షణశాఖ అనుమతి తప్పనిసరి
2013 సవరణ చట్టం అమలుకు ముందు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికతో లైంగిక సంబంధం బాలిక సమ్మతితో సంబంధం లేకుండా అత్యాచారంగా పరిగణించబడింది. అయితే, 2013 సంవత్సరంలో చట్టం సవరణ ద్వారా సమ్మతి వయస్సును 18కి పెంచింది. 18సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకోవడం బాలిక అనుమతి ఉన్నప్పటికీ అత్యాచారంగా పరిగణించబడుతుందని చట్టం సూచిస్తుంది.