Administrator Praful‌: సముద్రంలో మునిగి నిరసన తెలిపిన లక్షద్వీప్ వాసులు

కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌ రూపొందించిన డ్రాఫ్ట్ విమర్శలకు తావిస్తుంది. లక్షద్వీప్​లో మద్య నిషేధాన్ని ఎత్తివేయడం.

Administrator Praful‌: సముద్రంలో మునిగి నిరసన తెలిపిన లక్షద్వీప్ వాసులు

Administrator Praful‌: కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌ రూపొందించిన డ్రాఫ్ట్ విమర్శలకు తావిస్తుంది. లక్షద్వీప్​లో మద్య నిషేధాన్ని ఎత్తివేయడం, బీఫ్ పై బ్యాన్ విధించడం, తీర ప్రాంత చట్టాన్ని ఉల్లంఘించారని తీరంలోని మత్స్యకారుల షెడ్లను తొలంగించడం వంటి చర్యలు లక్షద్వీప్ ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ప్రఫుల్‌ పటేల్‌ తీసుకొచ్చిన డ్రాఫ్ట్ కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ‘సేవ్​ లక్షద్వీప్​’ పేరుతో క్యాంపెయిన్​ నడుస్తుంది.

ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రజలు నిరసన తెలియచేస్తున్నారు. అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌ కు వ్యతిరేకంగా సముద్రంలో ఫలకార్డుల ప్రదర్శన నిర్వహించారు. సముద్రంలో ముగిని ‘సేవ్ లక్షద్వీప్’ సహా.. కేంద్రం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు ఉన్న ఫ్లకార్డులను నీటి అడుగున ప్రదర్శించారు. వీరితో పాటు స్థానికులు వారి వారి ఇళ్ల ముందు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.