SBI: ఆ అకౌంట్లకు మాత్రం జులై 1నుంచి ఛార్జీలు పెంచేసిన ఎస్‌బీఐ

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ కొన్ని అకౌంట్లకు జులై నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్‌ సేవింగ్స్‌ అంటే జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లు ఉన్నవారికి కొత్త సర్వీసు ఛార్జీలు వర్తించనున్నాయి.

SBI: ఆ అకౌంట్లకు మాత్రం జులై 1నుంచి ఛార్జీలు పెంచేసిన ఎస్‌బీఐ

Sbi

SBI: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ కొన్ని అకౌంట్లకు జులై నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్‌ సేవింగ్స్‌ అంటే జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లు ఉన్నవారికి కొత్త సర్వీసు ఛార్జీలు వర్తించనున్నాయి. మనీ విత్ డ్రా, చెక్‌బుక్‌పై లిమిట్స్ ను విధించడంతో పాటు అవి దాటి డ్రా చేస్తే భారీ మొత్తంలో ఫైన్ లు తప్పవని ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏదైనా బ్రాంచ్ ఏటీఎం నుంచి నాలుగు సార్లు మాత్రమే ఫ్రీగా మనీ విత్ డ్రా చేయాలి. ఆ లిమిట్ దాటితే మాత్రం ఒక్కోసారి అదనంగా రూ.15జీఎస్టీ తప్పదట. ఇప్పటి వరకూ ఇతర బ్యాంకుల్లో నాలుగు సార్లు దాటి తీస్తే ఎక్స్ ట్రా మనీ కట్ అయ్యేది.

ఇప్పుడు తమ ఏటీఎంలో డ్రా చేసినా కూడా ఫైన్ కట్టాల్సిందే. దీనిని బట్టి ఎస్‌బీఐ, ఇతర ఏటీఎంలు, ఎస్‌బీఐ బ్రాంచ్‌లో కలిపి నెలకు నాలుగు సార్లు మాత్రమే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది.

చెక్ బుక్ సంగతేంటి..
ఎస్‌బీఐ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్‌లో 10 చెక్‌ లీవ్స్‌ మాత్రమే ఉచితంగా ఇస్తుంది. వాడకం పెరిగి అంతకంటే ఎక్కువ అవసరం పడితే 10 చెక్‌ లీవ్స్ కలిగిన బుక్‌కి రూ.40లతో పాటు అదనంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. 25 చెక్‌ లీవ్స్ కలిగిన బుక్‌ కావాలంటే జీఎస్టీతో పాటు రూ.75 కట్టాల్సి ఉంటుంది.

నిర్ణయించిన సమయం కంటే ముందు ఎమర్జెన్సీగా చెక్‌ బుక్ కావాలని అడిగితే.. 10 లీవ్స్‌కి రూ.50+జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ బాదుడులో మినహాయింపునిస్తూ.. సీనియర్‌ సిటిజన్లకు చెక్ బుక్ ఛార్జీలు లేవని వెల్లడించింది.