ఏడుగురు SBI ఉద్యోగులకు కరోనా..బ్రాంచీలు మూసివేత

  • Published By: nagamani ,Published On : June 15, 2020 / 05:19 AM IST
ఏడుగురు SBI ఉద్యోగులకు కరోనా..బ్రాంచీలు మూసివేత

SBI ఉద్యోగులకు కరోనా మహమ్మారి సోకింది. దీంతో కొన్ని బ్రాంచీలను మూసివేయక తప్పలేదు. ఈ ఘటన మహారాష్ట్రంలో జరిగింది. మహారాష్ట్రంలో కరోనా మహమ్మారి ఎంతగా విలయతాండవం చేస్తోందో చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో మహారాష్ట్ర, థానేలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) మెయిన్ బ్రాంచ్‌లో 7గురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకడంతో బ్యాంకును మూసివేశామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 
 

ఈ బ్రాంచ్‌లో మొత్తం 25 మంది పనిచేస్తున్నారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా..వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మిగిలిన స్టాఫ్ వారితో కలిసి పనిచేశాం కాబట్టి తమకు కూడా కరోనా సోకి ఉంటుందేమోననే ఆందోళనలో ఉన్నారు. జోగేశ్వరి ఈస్ట్ ప్రాంతంలోని ఎస్‌బీఐ లోకల్ చెక్ ప్రెసెసింగ్ సెల్‌లో పనిచేస్తున్న క్యాష్ ఆఫీసర్‌కు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో బ్యాంకు బ్రాంచీని వారం రోజులపాటు మూసివేశారు. అంధేరీలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఓ తోటమాలికి వైరస్ సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా బ్యాంకును తాత్కాలికంగా మూసివేశారు.  

అలాగే ముందు జాగ్రత్త్ చర్యల్లో భాగంగా..అంధేరీ ప్రాంతంలోని ఎల్ సీసీసీ వద్ద ఉన్న బ్రాంచీని కూడా తాత్కాలికంగా మూసి వేశారు. ఆ బ్రాంచీలో పనిచేసే తోటమాలికి కూడా కరోనా సోకటంతో  అందేరీ బ్రాంచీని మూసివేశారు.