Corona : భౌతిక దూరం 6 అడుగులు సరిపోదు..!

కరోనా మహమ్మారిపై రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా భౌతిక దూరంపై అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Corona : భౌతిక దూరం 6 అడుగులు సరిపోదు..!

Corona

Corona : కరోనా మహమ్మారిపై రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా భౌతిక దూరంపై అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరుబయట కాకుండా ఆఫీస్, నివాస స్థలం వంటి ఇండోర్ ప్రాంతాల్లో గాలిద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోదని ఈ అధ్యయనంలో తేలింది.

Read More : School Boys : బడికి వెళ్లే పిల్లల బ్యాంకు అకౌంట్లో రూ.900 కోట్లు.. ఎలా వచ్చాయంటే?

వైరస్ ను అడ్డుకోవాలి అంటే భౌతిక దూరం ఒక్కటే సరిపోదని.. మాస్క్ ధరించడం, గదిలో గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ అధ్యయనంలో వెల్లడైంది. భవంతుల్లో కరోనా వైరస్ సోకిన వ్యక్తులు వదిలే గాలి ద్వారా ఎంత స్థాయిలో వైరల్ వ్యాప్తి చెందుతుందనే విషయం తెలుసుకునేందుకు అధ్యయనం చేసినట్లు యూఎస్ లోని పెన్సిల్వేనియా వర్సిటీ విద్యార్థి జెన్ పీ తెలిపాడు.

Read More : Gold Rate : బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

కాగా ఈ అధ్యయనం నిర్దిష్ట ప్రాంతం గుండా ప్రయాణించే గాలి వెలుతురు, వెంటిలేషన్ పరిస్థితులు మాట్లాడినప్పుడు గాల్లోకి వెదజల్లబడే వైరస్ స్థాయి.. ఇలా మూడు అంశాలపై అధ్యయనం చేశారు. ఇక ఈ అధ్యయనం ఫలితాలను సస్టేనబుల్‌ సిటీస్, సొసైటీ’ జర్నల్‌లో ప్రచురించారు.