Rajasthan Crisis: కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమిత్ షాతో భేటీ అయ్యారు.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు..

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ తదుపరి ముఖ్యమంత్రి కావడాన్ని వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో కొంతమంది ఎమ్మెల్యేలు ....

Rajasthan Crisis: కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమిత్ షాతో భేటీ అయ్యారు.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు..

Rajastan Cm

Rajasthan Crisis: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ తదుపరి ముఖ్యమంత్రి కావడాన్ని వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మహాత్మా గాంధీకి నివాళులర్పించి న అనంతరం గెహ్లాట్ మాట్లాడారు. కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా ఏకవాఖ్య తీర్మానం ఆమోదం పొందలేదని, ఆమోదించనందుకు ఇప్పటికీ బాధగా ఉందని, అందుకే క్షమాపణలు కూడా చెప్పానని తెలిపారు.

Rajastan Crisis: రాజస్తాన్ సీఎంగా తానే కొనసాగుతానని పరోక్ష సూచనలు చేసిన గెహ్లాట్

ప్రస్తుతం రాజస్థాన్‌లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే.. నేను వారికి కాపలాదారుగా ఉంటానని 2020 లో హామీ ఇచ్చానని, కానీ ఇప్పుడు పరిస్థితుల నేపథ్యంలో వారు చాలా కోపంగా ఉన్నారని గెహ్లాట్ అన్నారు. ఒకవేళ నేను రాజస్థాన్‌ను విడిచిపెట్టి వెళ్తే వారి పరిస్థితి ఏమిటనే ఆందోళన వారిలో వ్యక్తమైందని తెలిపారు. ఇతరులను (సచిన్ పైలెట్) సీఎంగా ఆమోదించడం కంటే తిరుగుబాటు చేయడమే మంచిదని వారు భావించారని, ఈ క్రమంలో కొందరు అమిత్ షా, జాఫర్ ఇస్లామ్, ధర్మేంద్ర ప్రదాన్ తో సైటీ భేటీ అయ్యారంటూ గెహ్లాట్ అన్నారు. రాజస్థాన్ సీఎల్పీ నేతగా జరిగిన దానికి నేను బాధ్యత తీసుకుంటున్నానని గెహ్లాట్ తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, వారు ఐదేళ్లు పూర్తిగా ప్రభుత్వం కొనసాగాలని కోరుకోవటం లేదంటూ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి బరిలో నిలవాలని గెహ్లాట్ ను సోనియా గాంధీ సూచించారు. దాదాపు జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు గెహ్లాట్ చేపడతారని వార్తలుసైతం వచ్చాయి. ఈ క్రమంలో రాజస్థాన్ లో సచిన్ పైలట్ తదుపరి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారంటూ చర్చజరిగింది. గెహ్లాట్ కు మద్దతుగా 82 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని బెదిరించడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి గెహ్లాట్ క్షమాపణలు సైతం చెప్పుకోవాల్సి వచ్చింది.