42మంది నోకియా ఉద్యోగులకు కరోనా పాజిటివ్..తమిళనాడు ప్లాంట్ మూసివేత

  • Published By: nagamani ,Published On : May 27, 2020 / 06:00 AM IST
42మంది నోకియా ఉద్యోగులకు కరోనా పాజిటివ్..తమిళనాడు ప్లాంట్ మూసివేత

కరోనా వైరస్ భయంతో లాక్‌డౌన్ విధించటంతో ఇప్పటికే దేశ వ్యాప్తంగానేకాదు ప్రపంచ వ్యాప్తంగా సంస్థలన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా..ఇప్పుడిప్పుడే తిరిగి తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో  తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లోని  ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా ప్లాంట్‌‌లో పనిచేస్తున్న 42మందికి సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ప్లాంట్ ను మూసివేసింది. 

గత వారం ప్లాంట్ తిరిగి తెరుచుకున్న తరువాత సిబ్బంది మధ్య సామాజిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంది యాజమాన్యం. కానీ సిబ్బందిలోని 42 మందికి కరోనా సోకిందనే వాదన వినిపిస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే ఎంతమంది కార్మికులు వైరస్ బారిన పడ్డారనేది నోకియా వెల్లడించలేదు. 

లాక్‌డౌన్ సడలింపుల క్రమంలో నిబంధనల ప్రకారం ఇక్కడ ప్లాంట్ కార్యకలాపాలను ప్రారంభించామని..భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ..క్యాంటీన్ లో కూడా మార్పులు చేస్తూ..నిబంధనలను పాటిస్తున్నామని నోకియా ఓ  ప్రకటనలో తెలిపింది. కానీ..ప్రస్తుత పరిణామాల మధ్య పరిమిత సిబ్బందితో త్వరలోనే కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని ఆశిస్తున్నామని చెప్పింది.

కాగా..  చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ  ఒప్పో కూడా ఇటీవల తిరిగి ప్రారంభించిన ఢిల్లీ శివార్లలోని ప్లాంట్‌ను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీలో ఉన్న మూడు వేలమందికిపైగా ఉన్నారు. వీరిలో ఆరు నుంచి తొమ్మిది మందికి కరోనా సోకడంతో  ప్లాంట్‌లో కార్యకలాపాలను గత వారం నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Read: అనుమతిస్తారా? : వలసకూలీల బ్యాగ్ లు మోస్తూ…యూపీ దాకా నడుస్తానన్న రాహుల్