పొలిటికల్ జట్కాబండి : ఇండిపెండెంట్ గా సుమలత పోటీ

పొలిటికల్ జట్కాబండి : ఇండిపెండెంట్ గా సుమలత పోటీ

మాండ్య పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు స్వయంగా ప్రకటించి.. రాజకీయ యుద్దానికి తెరతీశారు

పొలిటికల్ జట్కాబండి : ఇండిపెండెంట్ గా సుమలత పోటీ

మాండ్య పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు స్వయంగా ప్రకటించి.. రాజకీయ యుద్దానికి తెరతీశారు

వెటరన్ హీరోయిన్, కన్నడ సూపర్ స్టార్ అంబరీష్ భార్య సుమలత రాజకీయ కలకలం రేపుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేది చేసేది అని తెగేసి చెప్పారామె. కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించటం, సీఎం కుమారస్వామి ఫ్యామిలీ నుంచి మద్దతు లేకపోవటంతో.. స్వతంత్రంగా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారామె. మాండ్య పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు స్వయంగా ప్రకటించి.. రాజకీయ యుద్ధాకి తెరతీశారు.
Read Also : చంద్రబాబుని చెడుగుడు ఆడిన పోసాని

మాండ్య ఎంపీ కోసం సుమలత కొన్నాళ్లుగా పట్టుబడుతున్నారు. పొత్తుల్లో భాగంగా జేడీఎస్ కు ఆ సీటు వెళ్లింది. సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ స్వయంగా అక్కడి నుంచి పోటీకి దిగుతుండటంతో.. కాంగ్రెస్ నో చెప్పింది. ఆ తర్వాత ఆమె బీజేపీలోకి వెళతారనే ప్రచారం జరిగినా.. అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు. ఏకంగా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతుండటంతో సంచలనంగా మారింది. మాండ్య సీటును సుమలత పట్టుబట్టటానికి కారణం.. అక్కడి నుంచి అంబరీష్ మూడు సార్లు ఎంపీగా, ఓసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అంబరీష్ కుటుంబానికి పట్టున్న స్థానం ఇది. దీంతో సుమలత ఇక్కడి నుంచి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారమె. మాండ్య నుంచి సుమలత స్వతంత్రంగా పోటీ చేస్తుండటంతో.. బీజేపీ పరోక్షంగా మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

 

Read Also : ఎవరీ కొమ్మా పరమేశ్వర్ రెడ్డి : వివేక హత్య తరువాత మాయం

×