మమతాబెనర్జీ నామినేషన్ తిరస్కరించండి..ఈసీకి సువెందు ఫిర్యాదు

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నామినేషన్​ తిరస్కరించాలని బీజేపీ నేత,నందిగ్రామ్ లో మమతపై పోటీ చేస్తోన్న సువేందు అధికారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నామినేషన్ పత్రాల్లో మమత తనపై ఉన్న ఆరు క్రిమినల్​ కేసులను వెల్లడించలేదని సువెందు ఆరోపించారు.

మమతాబెనర్జీ నామినేషన్ తిరస్కరించండి..ఈసీకి సువెందు ఫిర్యాదు

Suvendu Adhikari

Suvendu Adhikari వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నామినేషన్​ తిరస్కరించాలని బీజేపీ నేత,నందిగ్రామ్ లో మమతపై పోటీ చేస్తోన్న సువేందు అధికారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నామినేషన్ పత్రాల్లో మమత తనపై ఉన్న ఆరు క్రిమినల్​ కేసులను వెల్లడించలేదని సువెందు ఆరోపించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత బుధవారం నందిగ్రామ్ టీఎంసీ అభ్యర్థిగా మమత నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అసోంలో మమతపై దాఖలైన 5 కేసులు, బంగాల్​లో సీబీఐ నమోదు చేసిన ఓ కేసు వివరాలను మమత తన అఫడవిట్ లో వెల్లడించలేదన్నారు. ఆమె నామినేషన్​ తిరస్కరించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు సువెందు తెలిపారు. వారు అవసరమైన చర్యలు తీసుకుంటారనే నమ్మకం ఉందని తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూస్తాను.. ఆ చర్యలు చట్టపరంగా ఉండాలి అని సువెందు పేర్కొన్నారు. సువేందు ఫిర్యాదులో కేసులకు సంబంధించిన నంబర్లను పేర్కొన్నారని, అయితే మమత చేసిన నేరాల గురించి వివరించలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు. ఈ అంశాన్ని పరిశీలించనున్నట్లు చెప్పారు.

సువేందు అధికారి ఫిర్యాదుపై ఇప్పటి వరకు టీఎంసీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అభ్యర్థులు తమ ఆస్తులు, క్రిమినల్​ కేసులపై వివరాలు దాస్తే వారి నామినేషన్​ తిరస్కరించాలని 2018లోనే ఎన్నికల సంఘానికి సూచించింది సుప్రీంకోర్టు. తమ అభ్యర్థి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన ప్రాథమిక హక్కు ఓటర్లకు ఉందని 2018మార్చిలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది.