‘Swimming in heaven’ :అందాల కొండల్లో స్విమ్మింగ్ పూల్…ఆనంద్ మహేంద్రా ఫిదా

పచ్చని కొండల్లో నేచర్ స్విమ్మింగ్ పూల్ అందాలకు బిజినెస్ టైకూన్ ఆనంద్ మహేంద్రా ఫిదా అయిపోయారు. ఈ అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ ఆనంద్ మహేంద్రాకు తెగ నచ్చేసింది. ‘ “Whaaaat ?ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు. నా ప్రయాణంలో బకెట్ లిస్టులో ఇదికూడా చేరిపోయింది..అంటూ ఆనందం వ్యక్తంచేశారు.

‘Swimming in heaven’ :అందాల కొండల్లో స్విమ్మింగ్ పూల్…ఆనంద్ మహేంద్రా ఫిదా

‘swimming In Heaven’ (2)

‘Swimming in heaven’In hills of beauty : ఆస్వాదించే మనస్సు ఉండాలే గానీ..ఈ భూమిపై అందాలకు కొదువ లేదు. తుళ్లిపడే జలపాతాలు..మనస్సుకు హాయిగొలిపే పచ్చని అడవులు,ఆకాశాన్ని ముద్దాడే పర్వత శిఖరాలు..ముచ్చటగొలిపే సీతాకోక చిలుకలు ఇలా అందాలను నిలయం భూతల్లి. రాలిపడిన ఆకులు..మొక్కల కింద చెట్ల కింద కుప్పలు కుప్పలుగో పోగుపడిన పూలు ఇలా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిస్తాయి. అందాలకే అందాలనిచ్చే ప్రకృతిని ఆస్వాదించాలేగానీ ఎన్నెన్నో అందాలు..అన్నింటో అందాలు కనిపించి కనువిందు చేస్తాయి. అటువంటి ఓ సహజసిద్ధమైన ఓ అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ ను షేర్ చేశారు బిజినెస్ టైకూన్ ఆనంద్ మహేంద్రా. అందంగా..విభిన్నంగా..వినూత్నంగా ఉండేది ఏవైనా సరే షేర్ చేసి అందరిని అలరించిటంతో ఆనంద మహేంద్రా ఎప్పుడూ ముందుంటారనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అటువంటిదో కొండల్లో స్విమ్మింగ్ పూల్..భలే భలే ఉందిలే.చూస్తే దిగి ఈతకొట్టాలని ఎవ్వరికైనా అనిపించేలా అత్యద్బుతంగా ఉందీ కొండల్లో స్విమ్మింగ్ పూల్.

సాధారణంగా పల్లెటూళ్లలో కాలువలు,దిగుడు బావుల్లో నీళ్లను చూస్తు వావ్..దిగి ఓ డైవ్ చేద్దాం అనిపిస్తుంది. అటువంటి పర్వతాల మద్యలో నీలాల నింగి నీడల్లో చుట్టూతా పచ్చని చెట్లతో అలరారే ప్రకృతి ఒడిలో ఓ స్విమ్మింగ్ పూల్ ఉంటే ఈత కొట్టాలనే కోరికను ఆపుకోగలమా? అటువంటిదే ఈ వండర్ నేచర్ స్విమ్మింగ్ పూల్. కొండల మధ్యలో ఉంది.

పచ్చని కొండల్లో నేచర్ స్విమ్మింగ్ పూల్ ఫోటోలను ట్విట్టర్ యూజర్ ఆనంద్ బకారియా ట్వీట్ చేయగా..ఆనంద్ మహేంద్రా రీ ట్వీట్ చేశారు. ఈ అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ ఆనంద్ మహేంద్రాకు తెగ నచ్చేసింది. ‘ “Whaaaat ?ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు. నా ప్రయాణంలో బకెట్ లిస్టులో ఇదికూడా చేరిపోయింది..ఈ అద్బుతమైన స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందో తెలుసుకోవడానికి సిద్ధార్థ బకారియా GPS ోఆర్డినేట్లు కావాలి’ అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

ఇలా చాలామంది ఈ ప్రదేశాన్ని సందర్శిస్తే ప్రకృతి సిద్ధమైన న్యాచురాలిటీ స్విమ్మింగ్ పూల్ దెబ్బతింటుందని..అందువల్ల బీపీఎస్ కో ఆర్డినేట్లు దీన్ని అడ్రస్ బహిరంగంగా షేర్ చేయవద్దని చాలామంది నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఈ అద్భుతమైన లొకేషన్ ఉత్తరాఖండ్, పిథోరాగర్ జిల్లా థార్చులాలోని ఖేలా గ్రామానిదని రివీల్ చేసేసినట్లుగా తెలుస్తోంది.