Auto Ambulance : కేఫ్ ఓనర్ గొప్పమనసు.. నిధులు సేకరించి ఆటో అంబులెన్సులు ఏర్పాటు

ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. ఈ కోవకే వస్తారు తమిళనాడుకి చెందిన కేఫ్ ఓనర్ రాధికా శాస్త్రి. ఆమె తన గొప్ప మనసు చాటుకున్నారు.

Auto Ambulance : కేఫ్ ఓనర్ గొప్పమనసు.. నిధులు సేకరించి ఆటో అంబులెన్సులు ఏర్పాటు

Auto Ambulance

Auto Ambulance : ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. ఈ కోవకే వస్తారు తమిళనాడుకి చెందిన కేఫ్ ఓనర్ రాధికా శాస్త్రి. ఆమె తన గొప్ప మనసు చాటుకున్నారు. మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజలకు అంబులెన్స్ సేవలు అందించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఆరు ఆటో రిక్షా అంబులెన్సులు సమకూర్చారు. నిధులు సేకరించి వీటిని ఏర్పాటు చేశారు.

రాధికా శాస్త్రి కన్నూర్ లో నివాసం ఉంటారు. ఆమెకు ఓ కేఫ్ ఉంది. సమాజానికి సేవ చేయాలని, పేదలకు వైద్య సేవలు అందించాలన్నది ఆమె కోరిక. దీంతో ఆమె ఆటో రిక్షా అంబులెన్సులకు రూపకల్పన చేశారు. తమిళనాడులోని కొండ ప్రాంతాలు, నీలగిరీస్ లో అంబులెన్స్ సేవలకు శ్రీకారం చుట్టారు. తమిళనాడు అటవీశాఖ మంత్రి రామచంద్రన్, కలెక్టర్ దివ్య ఆటో అంబులెన్సులు ప్రారంభించారు.

ఈ అంబులెన్సుల్లో రోగుల కోసం స్ట్రెచర్స్ ఏర్పాటు చేశారు. అలాగే రోగుల సహాయకుల కోసం ఏడు సీట్లు ఏర్పాటు చేశారు. ఇంకా ఆక్సిజన్ సిలిండర్లు, ఫైర్ ఎక్స్ టిన్ గ్యుషర్స్ అందుబాటులో ఉంచాచరు. రోగి సెగ్మెంట్ నుంచి డ్రైవర్ కేబిన్ వేరుగా ఉండేలా అరెంజ్ మెంట్స్ చేశారు.

”సోషల్ మీడియాలో ఎలక్ట్రిక్ ఆటో అంబులెన్స్ ల గురించి చూశాను. అది జబల్ పూర్ కి చెందిన వివేక్ తన్కా ప్రాజెక్ట్. నీలగిరీస్ లో కూడా అలాంటి సౌకర్యం ఉండాలని భావించాను. ఇక్కడ ఇరుకైన రోడ్లలో పెద్ద వాహనాలు వెళ్లడం కష్టం. అందుకే ఆటో అంబులెన్సులు అయితే మేలని నిర్ణయించాను. జబల్ పూర్ లో తయారీదారులను సంప్రదించాను. నీలగిరీస్ లో రోడ్లకు సరిపోయేలా అంబులెన్సులు తయారు చేసి ఇవ్వాలని కోరాను.

అంబులెన్సులు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాల్సి వచ్చింది. దీంతో నా కేఫ్ కి వచ్చే కస్టమర్లను విరాళం అడిగాను. అలాగే సోషల్ మీడియా క్యాంపెయిన్ల ద్వారా నిధులు సేకరించాను. అలా ఆటో రిక్షాలను అంబులెన్సులుగా మార్చేందుకు 30 రోజులు మాత్రమే పట్టింది. ఆరు 470-సీసీ బజాజ్ మ్యాక్సిమాలను రీమోడల్ చేశారు. ఒక్కో అంబులెన్స్ తయారీకి రూ.3.5లక్షలు ఖర్చు అయ్యింది” అని రాధికా శాస్త్రి తెలిపారు. కాగా, ఈ ఆరు అంబులెన్స్ ల కోసం రాధికా శాస్త్రి సుమారు రూ.21లక్షలు వ్యయం చేశారు.

autorickshaw ambulances

ఆటో అంబులెన్స్ లు తయారయ్యాయి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఆ వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ఎన్జీవోలు, మారుమూల గ్రామాల్లో రోగులకు సేవల కోసం అంబులెన్సులు అందుబాటులో ఉంచామని ఆమె తెలిపారు.

”మూడు రోజుల క్రితం ఆటోలు వచ్చాయి. కెట్టీ ప్రభుత్వ ఆసుపత్రి, పుష్పా ఆసుపత్రి, హోటల్ ఫెడరేషన్, కోటగిరి మెడికల్ ఫెలో షిప్ ఆసుపత్రి, కిండర్ ట్రస్ట్ కు డొనేట్ చేస్తాము. నాన్ క్రిటికల్ రోగులకు ఈ అంబులెన్సు ద్వారా గొప్ప సేవలు అందుతాయని భావిస్తున్నా. కొండ ప్రాంతాల్లోనూ ఈ అంబులెన్స్ లు బాగా ఉపయోగపడతాయి” అని మెడికల్ ఆఫీసర్ అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 108 అంబులెన్సులు ఉన్నాయి. అయితే రోడ్లు సరిగా లేని, ఇరుక్కుగా ఉన్న చోట్ల, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఈ అంబు ఆర్ ఎక్స్ లు బాగా ఉపయోగపడతాయని చెప్పారు.

వైద్య మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కోసం రాధికా శాస్త్రి గతంలోనూ కృషి చేశారు. కన్నూరులోని లాలీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ జనరేటర్ ఏర్పాటు చేయడంలో సాయం చేశారు. ఇందుకోసం ఆమె స్వయంగా నిధులు సేకరించారు.