Farmers Protest : చచ్చిన ఎలుకల్ని నోట్లో పెట్టుకుని అర్థనగ్నంగా రైతుల నిరసన

విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా మారింది రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం. సాగునీటి కోసం రెండు రాష్ట్రాల మధ్యా దశాబ్దాలుగా జరుగుతున్న నీటి వివాదం కాస్తా రైతులు చచ్చిన ఎలుకల్ని తింటు నిరసన వ్యక్తం చేసేలా చేసింది.

Farmers Protest : చచ్చిన ఎలుకల్ని నోట్లో పెట్టుకుని అర్థనగ్నంగా రైతుల నిరసన

Farmers Hold Dead Rats in Mouth in Protest

Updated On : September 29, 2023 / 8:40 AM IST

Farmers Protest Dead Rats in Mouth : చచ్చిన ఎలుకల్ని నోట్లో పెట్టుకుని అర్థనగ్నంగా రైతులు నిరసన తెలిపారు. రైతులు నిసనలు ఎందుకు చేస్తారు..?గిట్టు బాటు ధర కోసం..లేదా సాగునీరు కోసం. రైతులకు కావాల్సింది ప్రధానంగా అవే. అందుకే రైతులు వినూత్నంగా చచ్చిన ఎలుకల్ని నోట్లో పెట్టుకుని నిరసనలు తెలిపారు. దీనికి కారణం రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే నీటి వివాదం..

దశాబ్దాల కాలం నుంచి కావేరీ జలాల నీటి వివాదం కొనసాగుతోంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య సాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కావేరీ జలాల కోసం రెండు రాష్ట్రాల అన్నదాతలు రోడ్డెక్కారు. కావేరీ నదీ జలాల నుంచి తమిళనాడుకు రోజుల పాటు రోజుకు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ- సీడబ్ల్యుఎంఏ ఆదేశాలు ఇచ్చింది. దీంతో కర్ణాటక రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వటంతో ఈ ఉత్తర్వులను అడ్డుకోవాలని కోరుతు కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ అక్కడ కూడా సిద్ధరామయ్య సర్కార్‌కు చుక్కెదురైంది.

Dog Barking : రైల్వే స్టేషన్‌లో కుక్కలా మొరిగిన వందలాదిమంది .. ఎందుకంటే..?

నీటి విడుదలపై కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని.. ఇటువంటి పరిస్థితుల్లో తమకు తాగు, సాగు నీటి అవసరాలు ఉన్నాయని కాబట్టి నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

దీంతో తమిళనాడు రైతులు వినూత్నంగా నిరసనలు చేపట్టారు. తిరుచ్చిలో రైతులు నోట్లో చచ్చిన ఎలుకల్ని పెట్టుకుని అర్థ నగ్నంగా నిరసనలు వ్యక్తంచేశారు. కావేరీ జలాలు విడుదల చేయకపోతే ఎడారిగా మారే తమ ప్రాంతంలో ఎలుకలు తిని బతకాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు.. తమిళనాడుకు నీటి విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా కర్ణాటకలో కూడా నిరసనలు మిన్నంటాయి. బెంగళూరులో రైతు సంఘాలు మంగళవారం బంద్ నిర్వహించాయి. బెంగళూరులో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ఇలా కావేరీ జలాల వివాదం అంతకంతకు ముదురుతోంది. ఇరు రాష్ట్రాల మధ్యా వివాదం కొనసాగుతోంది.