Tamil Nadu : మరోవారం లాక్​ డౌన్​ పొడిగింపు..నిబంధనలతో సడలింపులు ప్రకటించిన ప్రభుత్వం

లాక్ డౌన్ తో కరోనా కంట్రోల్ లోకి వస్తున్న క్రమంలో పొడిగించటమే మేలుగా కనిపిస్తున్నక్రమంలో తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ ను మరో వారం పొడిగించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ విధించటంతో కరోనా కంట్రోల్ లోకి వచ్చింది. దీంతో మరో వారం రోజుల పాటు పొడిగించాలని సీఎం స్టాలిన్ ప్రభుత్వం భావించింది.

Tamil Nadu : మరోవారం లాక్​ డౌన్​ పొడిగింపు..నిబంధనలతో సడలింపులు ప్రకటించిన ప్రభుత్వం

Tamilnadu

Extends Lockdown In Tamil Nadu : లాక్ డౌన్ తో కరోనా కంట్రోల్ లోకి వస్తున్న క్రమంలో పొడిగించటమే మేలుగా కనిపిస్తున్నక్రమంలో తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ ను మరో వారం పొడిగించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ విధించటంతో కరోనా కంట్రోల్ లోకి వచ్చింది. దీంతో మరో వారం రోజుల పాటు పొడిగించాలని సీఎం స్టాలిన్ ప్రభుత్వం భావించింది. లాక్ డౌన్ ను పొడిగిస్తే మరింతగా కరోనాను కట్టడి చేయవచ్చనే ఉద్ధేశంతో జూన్ 14 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ..కొంత ఇబ్బందులు ఉన్నా..కరోనా నియంత్రణ కోసం లాక్ డౌన్ ను జూన్ 14 వరకూ పొడిగిస్తున్నట్లుగా తెలిపింది. కరోనా కట్టడి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేసిన అనంతరం లాక్ డౌన్ ను పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే లాక్ డౌన్ పొడిగింపుతో పాటు కొన్ని సడలింపులను కూడా ఇచ్చింది. ముఖ్యంగా రాజధాని చెన్నై లో మరిన్ని సడలింపులను ప్రకటించింది. ఇప్పటికే అనుమతించిన కార్యాకలాపాల కోసం అన్ని జిల్లాల్లోనూ అనుమతి ఇస్తున్నట్లుగా స్పష్టం చేసింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న 11 జిల్లాల్లో జాగ్రత్తలు తీసుకుంటూనే కొన్ని సడలింపులు ప్రకటించింది. ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకుని సడలింపులను ప్రకటించింది. ముఖ్యంగా నిత్యావసరాల కోసం కిరాణా దుకాణాలు, కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లను ముఖ్యంగా హోల్ సేల్ షాపులకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతించారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం సిబ్బందితో పనులు చేసేందుకు పర్మిషన్ఇచ్చారు. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీసులకు కూడా అనుమతులు ఇచ్చినా..కేవలం రోజుకు 50 టోకెన్లకే పరిమితం చేశారు. చెన్నై వంటి నగరాల్లో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, హౌస్ కీపింగ్ ఏజెన్సీలకూ ఈ–రిజిస్ట్రేషన్ ద్వారా సేవలందించేందుకు అనుమతులిచ్చింది. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మోటార్ టెక్నీషియన్లు, కార్పెంటర్లూ,వాహన మెకానిక్ లకూ కూడా పనులు చేసుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పనులు చేసుకోవటానికి అనుమతినిచ్చింది. వీరంతా కచ్చితంగా కరోనా నిబంధనలు పాటిస్తూ వారి వారి పనులు చేసుకోవచ్చని సూచించింది.