రాష్ట్రంలో మద్య నిషేధం : స్కూల్లోనే తాగి తందనాలాడిన టీచర్లు

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 05:01 AM IST
రాష్ట్రంలో మద్య నిషేధం : స్కూల్లోనే తాగి తందనాలాడిన టీచర్లు

సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలోని ఓ స్కూల్లో టీచర్లు క్లాస్ రూమ్ లోనే తాగి తందనాలడారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన సాక్షాత్తు టీచర్లు క్లాస్ రూమ్ లో మద్యం తాగి నానా హడావిడి చేసిన ఘటన స్థానికంగా సంచలన కలిగించింది. 

బీహార్ రాజధాని పాట్నాకు 165 కిలోమీటర్ల దూరంలోని మధుబన్ పట్టణంలోని సరేయ నవీన్ అప్ గ్రేడెడ్ మిడిల్ స్కూల్లో ముగ్గురు టీచర్లు క్లాస్ రూమ్ లోనే మద్యం తాగి హల్ చల్ చేశారు. డాన్సులేశారు. నానా గలాటా చేశారు. ఈ స్కూల్లో మాస్టర్లుగా పనిచేస్తున్న గజేంద్ర బైతా, సత్యేంద్ర చౌదరి, అభయ్ సింగ్ లు  వారం రోజుల క్రితం స్కూల్ రూమ్ లోనే మద్యం తాగుతుండగా గ్రామస్థులు కిటికీలో నుంచి వీడియో తీశారు.

మద్యం కిక్ లో ఉన్న టీచర్లు ఇదేమీ గమనించాలేదు. ఫుల్ గా మందు కొట్టి చిందులేశారు. ఇంతా గ్రామస్తులు వీడియో తీశారు. దాన్ని బుధవారం (డిసెంబర్ 25) సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మధుబన్ బ్లాక్ విద్యాశాఖాధికారి ఉమేష్ కుమార్ సింగ్ దర్యాప్తు చేసి, ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా బీహార్ లో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.